టీడీపీ నుంచి ఇద్దరు బీజేపీ నుంచి ఒకరు పేర్లను రాజ్యసభకు నామినేట్ చేస్తూ ఖరారు చేశారు. సానా సతీష్, బీద మస్తాన్ రావు పేర్లను టీడీపీ ఖరారు చేసింది. ఆర్.కృష్ణయ్య పేరును ఇప్పటికే బీజేపీ అధిష్ఠానం ప్రకటించింది. రేపు వీరంతా నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ మూడు స్థానాలూ ఏకగ్రీవం అయ్యే అవకాశం ఉంది.
టీడీపీ నుంచి ఇద్దరు..బీజేపీలో ఒకరు..
బీద మస్తాన్ రావు.. ఈయన గత ప్రభుత్వంలో రాజ్యసభ ఎంపీ. ఎన్నికల సమయంలో వైసీపీ నుంచి జంప్ చేసి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. కచ్చితంగా తన రాజ్యసభ ఎంపీ స్థానం తనకే ఉంటుందనే హామీ తీసుకుని పార్టీ మారినట్లు తెలిసింది. దానికి తగ్గట్లే ఇప్పుడు పార్టీ బీద మస్తాన్ రావును రాజ్యసభ సభ్యునిగా ఖరారు చేసింది. ఈయన ఒక వ్యాపారవేత్త. ఇక ఈ పార్టీ నుంచి ఎంపిక అయిన మరో నేత సానా సతీష్ కాకినాడ ఎంపీ స్థానాన్ని ఆశించి వదులుకున్నారు. అందుకే ఇప్పుడు ఈయనకు రాజ్యసభ స్థానాన్ని టీడీపీ అధిష్ఠానం ఖరారు చేసింది.
బీజేపీ నుంచి ఖరారు అయిన ఆర్. కృష్ణయ్య..ఈయన తెలంగాణ నుంచి వచ్చారు. కృషణయ్యను గత ప్రభుత్వం కూడా రాజ్యసభకు పంపింది. రాజకీయాల్లో టీడీపీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎల్బీ నగర్ నుంచి 2014లో పోటీ చేసి గెలిచాడు. ఆ తరువాత 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసి ఓడిపోయాడు.. ఆ తరువాత వైసీపీ ఆర్.కృష్ణయ్యను రాజ్యసభకు పంపించింది.. 2024లో ఆర్.కృష్ణయ్య రాజ్యసభకు, వైసీపీకి రాజీనామా చేసారు.. అయితే బీసీ ఉద్యమ నాయకుడు కావడం.. బీజేపీకి బీసీలలో కచ్చితంగా ఓటు బ్యాంకు పెంచుకోవాల్సిన అవసరం ఉండటంతో ఆర్.కృష్ణయ్యను దగ్గర చేసుకున్నారు. ఇప్పుడు ఇదే కారణంతో, భవిష్యత్తులో బీజేపీ బలపడాలనే ఉద్దేశంతో ఈయనను రాజ్యసభకు ఖరారు చేసింది బీజేపీ.
Also Read: Delhi:తగ్గేదేలే అంటూ కేజ్రీవాల్..రప్పా రప్పా అంటూ బీజేపీ పోస్టర్ వార్..