Telangana Government : గణేష్ నిమజ్జనం రోజు సెలవు

సెప్టెంబర్ 17న ప్రభుత్వ సంస్థలకూ, స్కూళ్ళకూ సెలవును ప్రకటించింది. ఆరోజున హైదరాబాద్, సికింద్రాబాద్‌లలో వినాయక నిమజ్జనం జరగనుంది. దీనిలో ప్రజలు లక్షల్లో పాల్గొననున్నారు. అందుకే ఆరోజున అందరికీ సెలవును అనౌన్స్ చేసింది తెలంగాణ గవర్నమెంట్.

author-image
By Manogna alamuru
ganesh
New Update

Ganesh Immersion :

తెలంగాణ ట్విన్ సిటీస్‌లో వినాయచవితి, నిమజ్జనం అంటే ఎంత హడావుడి ఉంటుందో చెప్పక్కర్లేదు. నిమజ్జనం రోజు వేలమంది ప్రజలు హైదరాబాద్‌ వీధుల్లోకి వస్తారు. రోడ్లన్నీ జనతో నిండిపోతాయి. పోలీసులు కూడా ఫుల ప్రొటక్షన్ ఇస్తారు. అందుకే ప్రభుత్వం కూడా నిమజ్జం రోజున సెలవు ఇస్తుంది. తెల్లవారు ఝామునే మొదలై దాదాపు మర్నాటి వరకూ కొనసాగుతుంది నిమజ్జనం. కొంత మంది తమ దగ్గర చెరువుల్లో చేస్తే..మరి కొంత మంది ఎంత దూరమైనా హుస్సేన్ సాగర్ వరకు వచ్చి వినాయకుడని నిమజ్జనం చేస్తారు.

దీనిన్ని దృష్టిల్లో పెట్టుకునే ఎప్పటిలానే తెలంగాణ ప్రభుత్వం ఈసారి కూడా వినాయక నిమజ్జనం రోజున ట్విన్ సిటీస్‌లో ఆఫీసులకు, స్కూళ్ళకు సెలవును ప్రకటించింది. సెప్టెంబర్ 17న వినాయక నవరాత్రులు ముగుస్తాయి. అదే రోజున ఖైరతాబాద్ బడా వినాయకుడితో పాటూ సిటీలో ఉన్న అన్ని వినాయకుళ్ళను నిమజ్జనం చేయనున్నారు అందుకే ఆ రోజున తెలంగాణ ప్రభుత్వం సెలవును ఇచ్చింది.

holiday

Also Read: Andhra Pradesh: సీనియర్ నేత పెద్ది రెడ్డికి కు కీలక పదవి

#telangana-government
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe