Hyderabad: స్కూల్‌లో డ్రగ్స్ తయారీ లైవ్‌లో దొరికిన కేటుగాళ్లు

తెలుగు రాష్ట్రాల్లో డ్రగ్స్ దందా కలకలం రేపుతోంది. డ్రగ్స్ భూతాన్ని పూర్తిగా రూపుమాపేందుకు పోలీసులు చేపట్టిన 'ఈగల్ టీమ్' ఆపరేషన్స్ విజయవంతంగా కొనసాగుతున్నాయి. తాజాగా హైదరాబాద్ లో మత్తు పదార్థాల ముఠాపై ఈగల్ టీం భారీగా దాడి చేసింది.

New Update
bowenpally

తెలుగు రాష్ట్రాల్లో డ్రగ్స్ దందా కలకలం రేపుతోంది. డ్రగ్స్ భూతాన్ని పూర్తిగా రూపుమాపేందుకు పోలీసులు చేపట్టిన 'ఈగల్ టీమ్' ఆపరేషన్స్ విజయవంతంగా కొనసాగుతున్నాయి. తాజాగా హైదరాబాద్ లోని బోయిన్ పల్లిలో మత్తు పదార్థాల ముఠాపై ఈగల్ టీం భారీగా దాడి చేసింది. పాత స్కూల్ భవనంలో రహస్యంగా ఆల్ఫాజోలం తయారీ జరుగుతున్నట్లు సమాచారం అందుకున్న ఈగల్ టీం, శుక్రవారం సాయంత్రం అక్కడికి చేరుకొని సోదాలు నిర్వహించింది.

బయట రాష్ట్రాలకు చెందిన వ్యక్తులతో

సోదాల్లో కిలోల కొద్దీ ఆల్ఫాజోలం, సుమారు రూ.20 లక్షల నగదు, అలాగే కల్లులో కలిపి మత్తు పెంచే ప్రత్యేకమైన పౌడర్ స్వాధీనం అయ్యాయి. అదేవిధంగా ఆల్ఫాజోలం తయారీకి ఉపయోగించే యంత్రాలు, సామాగ్రి కూడా పోలీసులు సీజ్ చేశారు. ప్రాథమిక విచారణలో ఈ కేంద్రాన్ని కొంతమంది స్థానికులు, బయట రాష్ట్రాలకు చెందిన వ్యక్తులతో కలిసి నడిపిస్తున్నట్లు తెలిసింది. ఈ మత్తు పదార్థాలను నగరంలోని కొన్ని ప్రాంతాలకు సరఫరా చేస్తూ, అక్రమంగా డబ్బు సంపాదిస్తున్నట్టు ఈగల్ టీం గుర్తించింది.

ఇప్పటికే కేసు నమోదు చేసి, సంబంధిత వ్యక్తులను అదుపులోకి తీసుకున్న పోలీసులు, మరికొంతమందిపై వేట కొనసాగిస్తున్నారు.మత్తు పదార్థాలపై ఎప్పటికప్పుడు ప్రత్యేక దాడులు కొనసాగుతాయని, ఇలాంటి అక్రమ కార్యకలాపాలలో పాల్గొనే వారికి కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. ఈ దందాను అరికట్టడానికి ప్రభుత్వాలు మరిన్ని కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు అంటున్నారు.

Advertisment
తాజా కథనాలు