Drug party : గచ్చిబౌలిలో డ్రగ్స్ పార్టీ భగ్నం, 12 మంది అరెస్ట్!

గచ్చిబౌలి ప్రాంతంలో తాజాగా ఓ డ్రగ్స్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. కోలివింగ్ గెస్ట్ రూంలో జరుగుతున్న డ్రగ్ పార్టీపై పక్కా సమాచారం అందుకున్న స్పెషల్ ఆపరేషన్స్ టీమ్ (SOT) పోలీసులు..   డ్రగ్స్ పార్టీ చేసుకుంటున్న 12 మందిని అరెస్ట్ చేశారు.

New Update
drug

హైదరాబాద్ లో మరోసారి డ్రగ్స్ కలకలం సృష్టించింది. గచ్చిబౌలి ప్రాంతంలో తాజాగా ఓ డ్రగ్స్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. కోలివింగ్ గెస్ట్ రూంలో జరుగుతున్న డ్రగ్ పార్టీపై పక్కా సమాచారం అందుకున్న స్పెషల్ ఆపరేషన్స్ టీమ్ (SOT) పోలీసులు..   డ్రగ్స్ పార్టీ చేసుకుంటున్న 12 మందిని అరెస్ట్ చేశారు. కర్ణాటక నుంచి డ్రగ్స్ తెచ్చి హైదరాబాద్ యువకులకు అమ్ముతున్న స్మగ్లర్ ను అరెస్ట్ చేశారు. డ్రగ్స్ సప్లై చేస్తున్న గుత్తా తేజకృష్ణతో పాటు మరో నైజీరియన్ ను అదుపులోకి తీసుకున్నారు. 

Advertisment
తాజా కథనాలు