AA: అల్లు అర్జున్ కు బిగ్ షాక్.. పోలీసులకు ఫిర్యాదు!

తన అభిమానుల ని ఉద్దేశిస్తూ అల్లు అర్జున్ "ఆర్మీ "అనే పదాన్ని వాడడం తప్పు అంటూ  పలువురు స్వచ్చంద సంస్థల సభ్యులు ఫిర్యాదు చేశారు. హైదరాబాద్‌లోని  జవహర్ నగర్ పీఎస్‌లో లో బన్నీపై కంప్లైంట్ చేశారు.

New Update
allu arjungg

 టాలీవుడ్ సినీ హీరో అల్లు అర్జున్‌‌పై గ్రీన్ పీస్ ఎన్విరాన్‌మెంట్ & వాటర్ హార్వెస్టింగ్ ఫౌండేషన్ ప్రతినిధులు ఫిర్యాదు చేశారు. దేశ ఆర్మీని అవమానపరిచాడని...ఆర్మీ అనే పదానికి అర్ధం లేకుండా చేశాడని ఫిర్యాదులో చెప్పారు. ఆర్మీ విషయంలో దేశంలో ఉన్న నియమనిబంధనలు పాటించడం లేదని ఆరోపించారు. ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా జవహర్ నగర్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సర్కిల్ ఇన్‌స్పెక్టర్ సైదులుకు దీన్ని అందజేశారు. 

అల్లు అర్జున్ తన అభిమానులను అందరినీ కలిపి అల్లు అర్జున్ ఆర్మీగా పెట్టారని... దీనిని తాము తీవ్ర స్థాయిలో ఖండిస్తున్నామని గ్రీన్ పీస్ ఎన్విరాన్‌మెంట్ & వాటర్ హార్వెస్టింగ్ ఫౌండేషన్ ప్రతినిధులు చెప్పారు. దేశ ఆర్మీ జాతీయ సమగ్రత, జాతీయ భద్రతను అవమానిస్తూ ఆయన విభిన్న వేదికలపై మాట్లాడడం విచారకరమని చెప్పారు.  అల్లు అర్జున్ మీద ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని కోరారు. 

Also Read: TS: టెన్త్ పరీక్షలపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

Advertisment
తాజా కథనాలు