/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/10TH-CLASS-jpg.webp)
10వ తరగతి పరీక్ష విధానంలో మార్పులు చేస్తూ నిన్న జారీ చేసిన ఉత్తర్వుల్లో ఈ రోజు సవరణలు చేసింది తెలంగాణ ప్రభుత్వం. 100 మార్కులతో ఎగ్జామ్ విధానాన్ని వచ్చే విద్యా సంవత్సరం (2025-26) నుండి అమలు చేయాలని డిసైడ్ అయింది. ఈ విద్యా సంవత్సరంలో పాత విధానం 20 శాతం ఇంటర్నల్ మార్కులు.. 80 శాతం ఎగ్జామ్ మార్కులతోనే వెళ్ళాలని నిర్ణయించింది. గత కొన్నేళ్ళుగా గ్రేడింగ్ పద్ధతిలో రిజల్ట్స్ ఇస్తున్నారు. అయితే తాజాగా ఈ గ్రేడింగ్ సిస్టమ్ ను ఎత్తివేసినట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇంటర్నల్ మార్కుల్లో అక్రమాలు జరుగుతున్నాయనే ఫిర్యాదులు రావడంతో విద్యాశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. కానీ ఈరోజు మళ్ళీ ఈ నిర్ణయాన్ని మార్చుకుంది.