పెండింగ్ ప్రాజెక్టుల పనులను వేగవంతం చేయాలి– సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆరు నెలల్లో వీలైనంత ఆయకట్టుకు సాగునీటిని అందించే ప్రాజెక్టులను మొదటి ప్రాధాన్యంగా ఎంచుకోవాలని సూచించారు. By Manogna alamuru 26 Sep 2024 | నవీకరించబడింది పై 26 Sep 2024 23:36 IST in హైదరాబాద్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి CM Revanth Reddy: రాబోయే రెండేండ్లలో పూర్తయ్యే ప్రాజెక్టుల పనులను వేగవంతం చేయాలని ఇరిగేషన్ శాఖకు దిశా నిర్దేశం చేశారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. దాంతో పాటూ రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులపై జలసౌధలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి , తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, నీటి పారుదల శాఖ ఉన్నతాధికారులతో నిర్వహించిన సమావేశంలో ముఖ్యమంత్రి గారు సమీక్షించి పలు సూచనలు చేశారు.ఇప్పటికే 75 శాతం, అంతకు మించి పనులు చేసిన ప్రాజెక్టులను పూర్తి చేస్తే వచ్చే ఖరీఫ్‌లోగా మరింత ఆయకట్టుకు సాగునీరు అందించే అవకాశముందని చెప్పారు. అటు గోదావరి బేసిన్, ఇటు కృష్ణా బేసిన్‌లో ప్రాధాన్యంగా ఎంచుకున్న ప్రాజెక్టులకు నిధులకు ఇబ్బంది లేకుండా చూడాలని ఆర్థిక శాఖకు ఆదేశాలు జారీచేశారు రేవంత్ రెడ్డి. తక్కువ సమయంలో ఎక్కువ ఆయకట్టుకు నీటిని అందించే ప్రాజెక్టులకు గ్రీన్ చానల్ ద్వారా బిల్లుల చెల్లింపులు జరగాలి. ఇక కొనసాగుతున్న ప్రాజెక్టుల కోసం ముందుగా భూసేకరణ వేగంగా పూర్తి చేయాలి. అందుకు రెవిన్యూ విభాగంతో సమన్వయం చేసుకోవాలి. భూసేకరణలో మానవీయత ఉండాలి. భూములు ఇచ్చే వారితో అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి సంప్రదింపులు జరపాలి అని అధికారులకు సూచించారు సీఎం. అలాగే రాష్ట్రంలో వివిధ ప్రాజెక్టుల పరిధిలో పేరుకుపోయిన పూడిక తీతపై ఇతర రాష్ట్రాలు అనుసరిస్తున్నవిధానాలు, సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని అన్నారు. ఈసమావేశంలో అధికారులు ఏఏ ప్రాజెక్టులు తొందరగా పూర్తి చేసేందుకు అవకాశాలున్నాయి. వాటికి అవసరమైన నిధుల వివరాలను నీటి పారుదల శాఖ అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఇదే సమావేశం నుంచి అన్ని జిల్లాల ఎస్ఈలతో ముఖ్యమంత్రి గారు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు.రాష్ట్రంలో వివిధ ప్రాజెక్టుల పరిధిలో సగటున 25 శాతం పూడిక, ఇసుక మేటలున్నాయని ఇటీవల ఒక ఏజెన్సీ అధ్యయన నివేదికలో వెల్లడయిందని ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రెటరీ రాహుల్ బొజ్జా చెప్పారు. దీనిపై సమీక్ష నిర్వహించారు సీఎం రేవంత్ రెడ్డి. పూడికతీతపై జాతీయ పాలసీని అన్వయం చేసుకునే ముందు మరోసారి సాధ్యాసాధ్యాలు, ఏయే పద్ధతులను అనుసరించాలి.. వాటితో ఉండే లాభనష్టాలను మరోసారి బేరీజు వేసుకోవాలని సీఎం కు వివరించారు. Also Read: Cinema: వరల్డ్ వైడ్‌గా మొదలైన దేవర ఫీవర్ మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి