Cinema: వరల్డ్‌ వైడ్‌గా మొదలైన దేవర ఫీవర్

 జూ.ఎన్టీయార్ నటించిన దేవర సినిమా ఈరోజు రాత్రివిడుదల అవనుంది. అర్ధరాత్రి నుంచే  స్పెషల్‌ షోలు మొదలుకానున్నాయి. ఈ క్రమంలో దేవర రివ్యూల పేరుతో సోషల్‌మీడియాలో అప్పుడే సందడి మాత్రం మొదలైపోయింది. 

author-image
By Manogna alamuru
New Update

Devara Movie: 


విడుదలకు ముందే ఇండస్ట్రీ రికార్డులను షేక్ చేస్తోంది దవర సినిమా. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలో దాదాపు 80 కోట్లు కలెక్ట్ అయింది. ఈరోజు అర్ధరాత్రి దేవర మూవీ విడుదలకు సిద్ధమైంది. తొలిరోజే రూ.200 కోట్ల మార్కు దాటుతుందని సినీ విశ్లేషకుల అంచనా వేస్తున్నారు. మరోవైపు దేవర సినిమా రికార్డుల షేక్ చేయబోతుందంటూ ఎన్టీయర్ ఫ్యాన్స్ హంగామా చేస్తున్నారు. ఇప్పటి నుంచే థియేటర్ల దగ్గర చేరి సంబరాలు చేసుకుంటున్నారు. థియేటర్ల దగ్గర టపాసులు పేల్చుతూ హడావుడి చేస్తున్నారు. 

కొరటాల శివ దర్శకత్వంలో  జూ.ఎన్టీయార్, జాన్వీకపూర్ జంటగా నటించిన మూవీ దేవర. ఆర్ఆర్ఆర్ తరువాత తారక్‌ నటించిన సినిమా ఇదే. దాదాపు మూడేళ్ళ తరువాత ఎన్టీయార్ సినిమా విడుదల అవుతోంది. దాంతో పాటూ శ్రీదేవి కూతురు జాన్వీకపూర్ కు ఇదే మొదట తెలుగు సినిమా కూడా. దేవర సినిమాకు అనిరుద్ధ్ రవిచంద్రన సంగీతాన్ని అందించారు. ఈ మూవీలో ఎన్టీయార్ రెండు పాత్రల్లో నటించారు.

Also Read: supreme Court: బిల్కిస్ బానో కేసులో గుజరాత్‌కు చుక్కెదురు

Advertisment
తాజా కథనాలు