/rtv/media/media_files/XEtIDAqRAbrjlJ7OKMoI.jpg)
Congress Vs BRS Fight: తెలంగాణ భవన్ లో సోమవారం తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మంత్రి కొండా సురేఖపై బీఆర్ఎస్ దుష్ప్రచారం చేయడంపై కాంగ్రెస్ శ్రేణులు నిరసన చేపట్టారు. ఇందులో భాగంగానే తెలంగాణ భవన్ ముందు బీఆర్‌ఎస్ దిష్టిబొమ్మను దహనం చేశారు కాంగ్రెస్ కార్యకర్తలు. అనంతరం బీఆర్ఎస్ ఆఫీస్ లోపలికి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో కాంగ్రెస్ కార్యకర్తలను బీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకోవడంతో వివాదం మొదలైంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తల బాహాబాహికి దిగారు. ఇరువర్గాల మధ్య తోపులాట జరిగగా.. కొంతమంది చోక్కాలు పట్టుకుని కొట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.
అలాగే హైడ్రాపై బీఆర్ఎస్ దుష్ప్రచారం చేస్తోందంటూ కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున తెలంగాణ భవన్ వద్దకు చేరుకున్నారు.
Follow Us