/rtv/media/media_files/2025/08/22/kphb-2025-08-22-12-22-40.jpg)
కూకట్‌పల్లిలో పదేళ్ల బాలిక సహస్ర హత్య కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. అయితే ఈ కేసులో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ కేసులో పోలీసులు ఒక అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతని పేరు సంజయ్. అతను ఒరిస్సా రాష్ట్రానికి చెందినవాడని, సహస్ర కుటుంబం నివాసం ఉంటున్న భవనంలోనే అతను రెండో అంతస్తులో నివసిస్తున్నాడని దర్యాప్తులో తెలిసింది. పోలీసులు అతనిని విచారిస్తున్నారు. హంతకుడు తెలిసిన వ్యక్తే అని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.
అనుమానాస్పదంగా వ్యక్తి కదలికలు
అయితే ఈ హత్య కేసులో సీసీ ఫుటేజ్ సంచలనం సృష్టించింది. హత్య జరిగిన టైమ్‌లో అనుమానాస్పదంగా ఓ వ్యక్తి కదలికలు బయటకు వచ్చాయి. హత్య జరిగిన రోజు ఉదయం 9:57 గంటలకు అనుమానితుడు భవనం గేటు వెనుక నక్కినట్లు సీసీటీవీ ఫుటేజ్‌లో రికార్డ్ అయింది. అక్కడ ఒక పారిశుద్ధ్య కార్మికుడు రాగానే అతను దాక్కున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ వీడియో ఫుటేజ్ దర్యాప్తులో కీలకంగా మారింది. హత్యకు గల కారణం ఇంకా స్పష్టంగా తెలియలేదు. గేటు చాటుకు దాక్కున్న ఆ వ్యక్తి ఎవరు? ఆ బిల్డింగ్‌లో నుంచే సహస్ర బిల్డింగ్‌లోకి వచ్చాడా? ఇన్నిరోజులైనా ఆ వ్యక్తి ఎవరో ఎందుకు కనిపెట్టలేదనే అనుమానాలు నెలకొన్నాయి. ప్రస్తుతం పోలీసుల అదుపులో చిన్నారి తల్లిదండ్రులున్నారు. తల్లిదండ్రుల్ని కూడా పోలీసులు విచారిస్తున్నారు.
అయితే సంజయ్ తన భార్య అనారోగ్యానికి సహస్ర కుటుంబాన్ని నిందించేవాడని, పగతోనే ఈ దారుణానికి పాల్పడి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితుడిని పట్టుకోవడానికి పోలీసులు ఆరు బృందాలను ఏర్పాటు చేశారు. సీసీటీవీ ఫుటేజ్, సాంకేతిక ఆధారాలు, సాక్షుల వాంగ్మూలాల ఆధారంగా దర్యాప్తు కొనసాగుతోంది.ఆగస్టు 18న కూకట్‌పల్లిలోని సంగీత్‌నగర్‌లో సహస్ర దారుణ హత్యకు గురైంది. సహస్ర తల్లిదండ్రులు పనికి వెళ్ళిన సమయంలో ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలికను ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు గొంతు కోసి, కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన నగరంలో తీవ్ర భయాందోళనలకు గురిచేసింది. పోలీసులు ఈ కేసును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని దర్యాప్తును వేగవంతం చేశారు.