అల్లు అర్జున్‌కు మళ్ళీ బిక్ షాక్ తగలనుందా అంటే అవుననే అంటున్నారు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో పోలీసులు సంచలన ఆధారాలు బయటపెట్టినట్లు తెలుస్తోంది. దీంతో అల్లు అర్జున్ బెయిల్‌ను రద్దు చేయనున్నారని చెబుతున్నారు. పుష్ప-2 ప్రీమియర్ షో సందర్భంగా హీరో,హీరోయిన్ వస్తున్నారని థియేటర్ యాజమాన్యం...పోలీసుల అనుమతి కోరారు. దాంతో హీరో, హీరోయిన్ వస్తే క్రౌడ్ విపరీతంగా ఉంటుందని..వాళ్లను రావొద్దని చెప్పాలంటూ థియేటర్ యజమాన్యానికి పోలీసులు లేఖ రాశారని...కానీ దానిని ఎవరూ పట్టించుకోలేదని తెలుస్తోంది. పోలీసుల మాట వినకుండా ర్యాలీకి అల్లు అర్జున్ రాడంతోనే తొక్కిసలాట జరిగిందని..ఇందులో రేవతి అనే మహిళ మృతి చెందడమే కాక...శ్రీతేజ్ ప్రాణాలకోసం పోరాడుతున్నాడని పోలీసులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్‌కు ఇచ్చిన బెయిల్ రద్దు చేసి మళ్ళీ అరెస్ట్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.
మరోవైపు సంధ్య థియేటర్ తొక్కిసలాటలో గాయపడ్డ బాలుడు శ్రీతేజ్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆ బాలుడికి హాస్పిటల్‌లో వెంటిలేటర్ సాయంతో వైద్యులు శ్వాస అందిస్తున్నట్లు సమాచారం. శ్రీతేజ్‌కు పీడియాట్రిక్ ఐసీయూలో చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తోంది. తొక్కిసలాటలో గాయపడిన శ్రీతేజ్ అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 11 రోజులుగా చికిత్స పొందుతున్నాడు. ఇక శ్రీతేజ్ ఆరోగ్యంపై కుటుంబసభ్యుల ఆందోళన చెందుతున్నారు.
ఏం జరిగిందంటే?
పుష్ప 2 సినిమా డిసెంబర్ 5న విడుదల అయింది. దీనికంటే ఒకరోజు ముందు అంటే డిసెంబర్ 4న ప్రిమియర్ షో చూసేందుకు అల్జు అర్జున్ హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్డు వద్ద ఉన్న సంథ్య థియేటర్‌కు వెళ్లాడు. ఈ క్రమంలోనే తమ అభిమాన హీరోను చూడటానికి అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ నేపథ్యంలోనే రేవతి అనే మహిళా తన కొడుకు, భర్తతో కలిసి సంథ్య థియేటర్‌కు వెళ్లారు.
Also Read: Cricket: మళ్ళీ విఫలమైన కోహ్లీ...రిటైర్ అయిపో అంటూ ట్రోలింగ్