బోర్డర్–గవాస్కర్ ట్రోఫీలో భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అస్సలు బాగా ఆడటం లేదు. సింగిల్ డిజిట్స్ తప్ప ఏమీ కొట్టడం లేదు. ప్రస్తుతం బ్రిస్బేన్‌లో జరుగుతున్న మూడో టెస్ట్ మోదటి ఇన్నింగ్స్‌లో కూడా విరాట్ కేవలం మూడు పరుగులు మాత్రమే చేసి అఉటయ్యాడు దీంతో క్రికెట్ ఫ్యాన్ అతని మీద తెగ కోపంగా ఉన్నారు. మొత్తం జరిగిన అన్ని మ్యాచ్‌లలో ఒక్క పెర్త్‌లోనే రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీ చేశాడు కోహ్లీ. మిగతా అన్నింటిలోనూ నిరాశే మిగిల్చాడు. బ్రిస్బేన్ టెస్ట్ మొదటి ఇన్నింగ్స్‌లో కూడా చేతులెత్తేశాడు.
ఏంటీ ఆట కోహ్లీ..
ఈ క్రమంలో.. విరాట్ కోహ్లీపై సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు. ఎంఎస్ ధోనీని చూసి నేర్చుకోవాలని కోహ్లీకి సలహాలు ఇస్తున్నారు. ధోనీలాగ రిటైర్ అయితే బెటర్ అని చెబుతున్నారు. 2014లో ఆస్ట్రేలియా టూర్‌లో ధోని మధ్యలోనే రిటైరయ్యాడు. విరాట్ కోహ్లీ ధోని నుండి నేర్చుకుని టెస్ట్ క్రికెట్ నుండి రిటైర్మెంట్ తీసుకోవాలి. ఒకప్పుడు గొప్పగా ఉన్న బీసీసీఐ.. ఇప్పుడు సీనియర్ ఆటగాళ్లపై ఎందుకు సమయాన్ని వృధా చేస్తుంది అంటూ ఎక్స్‌లో ఒక వ్యక్తి పోసట్ చేశారు. ఈ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో విరాట్ కోహ్లీ సెంచరీ సాధించాలి. వర్షం కారణంగా ఈ ఇన్నింగ్స్ జరగకపోతే.. కోహ్లీ తదుపరి టెస్ట్ మ్యాచ్‌లో మొదటి ఇన్నింగ్స్‌లో సెంచరీ సాధించాలి, లేకపోతే రిటైర్ కావాలి అంటూ మరొక వ్యక్తి పోస్ట్ చేశారు. పరుగులు చేయలేకపోతే రిటైర్ అయి లండన్‌లో ఉండు మరో యూజర్ కామెంట్ చేశారు.
Virat Kohli has lost the hunger to score runs. No other reason 💔 pic.twitter.com/TQrLViSQhJ
— Dinda Academy (@academy_dinda) December 16, 2024
Virat Kohli has lost the hunger to score runs. No other reason 💔 pic.twitter.com/TQrLViSQhJ
— Dinda Academy (@academy_dinda) December 16, 2024
Also Read: Supreme Court: మసీదులో జైశ్రీరాం అంటే తప్పేంటి..సుప్రీంకోర్టు ప్రశ్న