అమీన్‌పూర్ మళ్లీ కూల్చివేతలు... ఈసారి హైడ్రా కాదు!

TG: హైడ్రా తరహాలో మున్సిపల్ అధికారులు పనిచేస్తున్నారు. అమీన్‌పూర్ మున్సిపాలిటీలో అక్రమకట్టడలపై ఉక్కుపాదం మోపుతున్నారు. సర్వే నెంబర్ 993లో ప్రభుత్వ భూమిని ఆక్రమించి నిర్మించిన ఏడు నిర్మాణాలను నేలమట్టం చేశారు.

New Update
HYDRA

Hydra: అమీన్‌పూర్ మున్సిపాలిటీలో మళ్లీ కూల్చివేతలు ప్రారంభమయ్యాయి. హైడ్రా తరహాలో అక్రమ కట్టడాలపై మున్సిపల్ అధికారుల ఉక్కుపాదం మోపుతున్నారు. సర్వే నెంబర్ 993లో ప్రభుత్వ భూమిని ఆక్రమించి నిర్మించిన ఏడు నిర్మాణాలను నేలమట్టం చేశారు. సరైన అనుమతులు లేకుండానే నోటరీ చేస్తూ మోసాలకు పాల్పడుతున్నట్లు అధికారులు గుర్తించారు. ముందస్తు సమాచారం ఇచ్చిన తర్వాతే అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నాం అని అమీన్‌పూర్ తహశీల్దార్ తెలిపారు.

చర్యలు తీసుకుంటాం...

2022 నుంచి రెవెన్యూ శాఖ పోరాటం చేస్తోందని తహశీల్దార్ రాధ చెప్పారు. పలుమార్లు కూల్చినా యజమానులు పట్టించుకోలేదని అన్నారు. కిష్టారెడ్డిపేటలో 164 సర్వే నెంబర్‌లో మూడు భారీ భవనాలు, పటేల్‌గూడలో సర్వే నెంబర్ 12, 208లో అక్రమంగా నిర్మించిన 26 ఇళ్లను కూల్చివేసినట్లు పేర్కొన్నారు. మరో ఐదు ఇళ్లలపై చర్యలు తీసుకుంటాం అని చెప్పారు.

Advertisment
తాజా కథనాలు