/rtv/media/media_files/2025/09/06/keerthy-2025-09-06-08-02-35.jpg)
హైదరాబాద్ లో గణేషుడి లడ్డూ వేలం పాట అంటే అందరికీ గుర్తుకువచ్చేది బాలాపూర్ లడ్డూనే.. కానీ ఇప్పుడు ఆ లిస్టులోకి కొత్తగా వచ్చి చేరింది బండ్లగూడ జాగీర్‌లోని కీర్తి రిచ్‌మండ్ విల్లాస్. ఇది బాలాపూర్ లడ్డూకు పోటీగా నిలిచింది. ఈ లడ్డూ వేలం ద్వారా వచ్చిన డబ్బును సేవా కార్యక్రమాలకు ఉపయోగిస్తారు.ఈ సారి ఈ గణేష్ లడ్డూ ధర ఏకంగా రూ.2.32 కోట్లు పలికింది. ఆక్షన్ లో వచ్చిన మొత్తాన్ని ఆర్‌వి దియా ఛారిటబుల్ ట్రస్టు ద్వారా ఎన్జీఓలకు లకు ఆర్థికసాయం చేస్తారు. ఈ సంస్థలు వృద్ధాప్య సంరక్షణ, మహిళా సంక్షేమం నుండి విద్య, పోషకాహారం, వైద్య సహాయం, జంతు సంక్షేమం వరకు పనిచేస్తాయి.
లిస్టు ఇదే
2018: వేలంపాట రూ. 25,000తో ప్రారంభమైంది.
2019: రూ. 18.75 లక్షలకు అమ్ముడైంది.
2020: రూ. 27.3 లక్షలకు అమ్ముడైంది.
2021: రూ. 41 లక్షలకు అమ్ముడైంది.
2022: రూ. 60 లక్షలకు అమ్ముడైంది.
2023: రూ. 1.26 కోట్లకు అమ్ముడైంది.
2024: రూ. 1.87 కోట్లకు అమ్ముడైంది. ఈ లడ్డూను 25 మంది సభ్యుల గ్రూప్ వేలంలో దక్కించుకుంది.
2025: రూ. 2.32 కోట్లకు అమ్ముడై, సరికొత్త రికార్డును సృష్టించింది.
ఈ వేలంలో 80 మంది విల్లా యజమానులు నాలుగు గ్రూపులుగా విడిపోయి పాల్గొన్నారని సమాచారం.
కీర్తి రిచ్‌మండ్ విల్లాస్ లడ్డూ వేలం ద్వారా వచ్చిన నిధులను పేద పిల్లల చదువు, హాస్టల్ విద్యార్థులకు సహాయం వంటి వివిధ సేవా కార్యక్రమాలకు ఉపయోగిస్తారు. ఈ సంప్రదాయం కేవలం ఒక వేడుకగా కాకుండా, సామాజిక సేవకు ఒక మార్గంగా కూడా మారింది.
Keerthi Richmond Villas : 10-kg Ganesh laddu auctioned for record ₹2.32 crore in Hyderabad’s Bandlaguda
— Hyderabad Real Estate Urban (@HydUrbanRealty) September 6, 2025
₹45 lakh higher than last year’s ₹1.87 crore.
RV Diya Charitable Trust, which supports over 42 NGOs.
These organisations work in areas ranging from old-age care,… pic.twitter.com/NK0nHrysVY