Gandhi Hospital :
హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలో దారుణం జరిగింది. ఎమర్జెన్సీ వార్డులో ఓ మహిళ జూనియర్ డాక్టర్‌పై పేషంట్ సహాయకుడు దాడి చేశాడు. అందరూ చూస్తుండగానే ఆమె చేయి పట్టుకొని, షర్ట్ లాగి బలంగా కొట్టేందుకు ప్రయత్నించాడు. అప్రమత్తమైన వైద్య సిబ్బంది డాక్టర్‌ను రక్షించారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడిని చిలకల గూడ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ దాడికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
సీసీ ఫుటేజ్.. గాంధీ ఆస్పత్రిలో మహిళా డాక్టర్ పై దాడి
— Telugu Scribe (@TeluguScribe) September 11, 2024
సికింద్రాబాద్ - గాంధీ ఆస్పత్రిలో ఓ లేడీ జూనియర్ డాక్టర్ పై దాడి కలకలం రేపింది.. మహిళా డాక్టర్ చేయి పట్టుకుని ఆమె అప్రాన్ లాగి రోగి బంధువు ఇబ్బంది పెట్టాడు.
అప్రమత్తమైన వైద్య సిబ్బంది డాక్టర్‌ను రక్షించారు. అనంతరం పోలీసులకు… pic.twitter.com/hqpfWsgZHa