Ganesh Laddu: ఆల్ టైమ్ రికార్డ్.. రూ.1.87కోట్లు పలికిన బండ్లగూడ గణేశ్ లడ్డూ! రంగారెడ్డి జిల్లా బండ్లగూడ మున్సిపల్ పరిధిలోని కీర్తి రిచ్ మండ్ విల్లాస్ గణపతి లడ్డూ ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ యేడాది వేలంలో రూ.1 కోటి 87లక్షలు ధర పలికింది. లడ్డూ దక్కించుకున్న భక్తుడి వివరాలు తెలియాల్సి ఉంది. By Manoj Varma 17 Sep 2024 | నవీకరించబడింది పై 17 Sep 2024 09:12 IST in తెలంగాణ హైదరాబాద్ New Update షేర్ చేయండి Ganesh laddu: రంగారెడ్డి జిల్లా బండ్లగూడ మున్సిపల్ పరిధిలోని కీర్తి రిచ్ మండ్ విల్లాస్ గణపతి లడ్డూ సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో కనీవినీ ఎరుగని రీతిలో ఈ యేడాది వేలంలో రూ.1 కోటి 87లక్షలు ధర పలికింది. ఈ లడ్డూ దక్కించుకున్న భక్తుడి వివరాలు తెలియాల్సి ఉంది. అయితే గతేడాది రూ.1.20 కోట్లు పలికిన ఇక్కడి లడ్డూ.. ఏకంగా 67 లక్షలు పెరగడం విశేషం. భారీ అంచనాల మధ్య బాలాపూర్ లడ్డూ వేలం..ఇదిలా ఉంటే.. భారీ అంచనాల మధ్య బాలాపూర్ గణేష్ లడ్డూ వేలం ప్రారంభమైంది. గతేడాది 27 లక్షలు పలికిన బాలాపూర్ గణేష్ లడ్డు ఈసారి మరింత పెరిగే చాన్స్ ఉంది. 30 ఏళ్లుగా సాగుతున్న ఈ లడ్డూ వేలంపై ఈ ఏడాది భారీ అంచనాలున్నాయి. లడ్డూ వేలం పాటలో ఈసారి కొత్త నిబంధనలు పెట్టారు నిర్వాహకులు. ముందుగా 27లక్షలు కట్టిన వాళ్ళకే వేలంలో అవకాశం ఇస్తామని ప్రకటించారు. దీంతో ఈసారి 30 లక్షలకు పైగా పలుకుతుందని అంచనా వేస్తున్నారు. ధనవంతులు, రాజకీయ నాయకులు ఈ లడ్డూ కోసం పోటీపడుతున్నారు. 1994లో మొదలైన బాలాపూర్ లడ్డూ వేలంపాట తొలిసారిగా రూ.450తో ప్రారంభమైంది. 2016లో రూ.14.65 లక్షలు చేరి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేయగా.. 2017లో రూ.15.60లక్షలు, 2018లో రూ.16.60 లక్షలు, 2019లో 17.60 లక్షలు, 2021లో రూ.18.90 లక్షలు, 2022లో రూ.24.60 లక్షలు పలికింది. అయితే 2020లో కరోనా కారణంగా వేలం పాట రద్దు అయింది. బాలాపూర్ సర్కిల్ బొడ్రాయి వద్ద ఈ వేలం పాట జరగనుండగా.. వేలంపాట అనంతరం శోభాయాత్ర ప్రారంభం కానుంది. #ganesh-nimajjanam #balapur-ganesh-laddu-auction మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి