హైదరాబాద్‌లో దేవుళ్ల విగ్రహాలపై దాడులు చేయడం.. ధ్వంసం చేసేందుకు ప్రయత్నించడం లాంటి ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. నిన్న సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఆలయంపై దాడి ఘటన మరవకముందే నేడు మరో ఆలయంపై దాడి జరిగింది. తాగి గుడికి రావొద్దని పూజరి చెప్పడంతో రెచ్చిపోయిన ఓ తాగుబోతు అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేసేందుకు ప్రయత్నించాడు. దీంతో అడ్డుకున్న ఆలయ కమిటీ సభ్యులు నిందితుడి పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
ఇది కూడా చదవండి: Yadadri : యాదాద్రి లడ్డూ క్వాలిటీ.. ల్యాబ్ రిపోర్ట్ లో ఏం తేలిందంటే?
ఈ రోజు అంబర్ పేటలోని మహంకాళి టెంపుల్ లోకి వచ్చేందుకు ఫుల్లుగా మద్యం తాగి వచ్చిన ఓ వ్యక్తి ప్రయత్నించాడు. గమనించిన పూజారి.. తాగి ఆలయంలోకి రావడం సరికాదని చెప్పాడు. దీంతో రెచ్చిపోయిన ఆ తాగుబోతు.. విగ్రహాన్ని ధ్వంసం చేసేందుకు ప్రయత్నించాడు. దీంతో భక్తులు, ఆలయ కమిటీ సభ్యులు అతడిని అడ్డుకున్నారు. పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అయితే.. పోలీసులు మాత్రం ఇప్పటివరకు ఈ అంశంపై ఎలాంటి ప్రకటన చేయలేదు.
ఇది కూడా చదవండి: Hyderabad: దారుణం.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగినిపై అర్థరాత్రి ఆటోలో అత్యాచారం
కిషన్ రెడ్డి ఫైర్:
నిన్న సికింద్రాబాద్ లోని కుమ్మరిగూడలో ఓ వ్యక్తి సైతం ఆలయంలోనికి ప్రవేశించి అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేశాడు. విషయం తెలుసుకున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ తో కలిసి ఆలయాన్ని సందర్శించారు. కొందరు కావాలనే ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నారని ఫైర్ అయ్యారు. మళ్లీ ఇలాంటి ఘటనలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించారు. అన్ని ఆలయాల్లో సీసీ కెమెరాలను పెట్టాలని డిమాండ్ చేశారు.
ఇది కూడా చదవండి: Medigadda: మేడిగడ్డపై రేవంత్ సర్కార్ కు ఊహించని షాక్!
ఇది కూడా చదవండి: GROUP 1 Mains : గ్రూప్ -1 మెయిన్స్ కు హైకోర్టు గ్రీన్ సిగ్నల్