హైదరాబాద్‌లో ఇల్లు కొనాలనుకుంటున్నారా.. ఇవి ముఖ్యం!

హైదరాబాద్‌లో చిన్న స్థలం లేదా ఇల్లు కొనుక్కోవాలని అనుకునేవారు కొన్ని జాగ్రత్తలు పాటించాలని నిపుణులు చెబుతున్నారు. టైటిల్ సక్రమంగా ఉందా లేదా చెక్ చేసుకోవాలంటున్నారు. తర్వాత రెవెన్యూ ఆఫీసులో ఎఫ్‌టీఎల్, బఫర్‌జోన్‌ ప్రాంతాలు తెలుసుకోవాలని సూచిస్తున్నారు.

HMDA
New Update

హైదరాబాద్‌లో ఒక చిన్న స్థలం కొనుక్కొని మంచిగా ఇల్లు కట్టుకోవాలని అందరికీ ఉంటుంది. అందుకోసం చాలా కష్టపడతారు. తమ ఆశలు, కోరికలు సైతం చంపుకుని మూడు పూట్ల తినకుండా డబ్బులు పోగుచేస్తారు. అలా సంపాదించిన డబ్బుతో స్థలం లేదా ఇల్లు కొనేందుకు రెడీ అవుతారు. దీంతో తమ బంధువులు చెప్పారని లేదా తెలిసిన వారు చెప్పారని మధ్యవర్తులను నమ్మి పోసపోయినవారు ఎందరో ఉన్నారు.

దీంతో వారు కొనుక్కున్న ఆస్తి చేతికి రాకపోగా.. ఇచ్చిన డబ్బులు సైతం పోగొట్టున్నవారు ఎక్కువ మందే ఉన్నారు. అందువల్ల ఒక ఇల్లు లేదా స్థలాన్ని కొనేందుకు కొన్ని జాగ్రత్తలు పాటించాలని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

టైటిల్‌లో సమస్యలు ఉన్నాయా?

  • ఇక ఆస్తి లేదా ఇంటికి యాజమాన్య హక్కు అనేది అత్యంత కీలకమైనది. అందులవల్ల ఆస్తి లేదా ఇల్లు ఎవరి పేరుమీద ఉందో తెలుసుకోవాలి.
  • అంతేకాకుండా.. ఆ ఆస్తిపై గొడవలు కానీ, కేసులు కానీ ఉన్నాయా లేదా తెలుసుకోవాలి. లేదంటే చాలా సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది.
  • అలాగే వాటిని అమ్మేవారి దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ ఒరిజినలా కాదా అనేది చెక్ చేయాలి. ఈ విషయంలో ఎవరినీ గుడ్డిగా నమ్మకూడదు. ఒకవేళ మా బంధువు చెప్పాడు. తెలిసిన వారు చెప్పారు అని అనుకుంటే మాత్రం మీరు బుక్కైనట్లే అని చెప్పాలి.
  • టైటిల్‌ను చాలా కూలంకషంగా పరిశీలించాలి. రెండు మూడు సార్లు చెక్ చేయాలి. టైటిల్ గురించిన సమాచారం కోసం ఆ సర్వే నెంబర్‌తో తహసీల్దార్, రిజిస్ట్రేషన్ కార్యాలయం లేదా మున్సిపల్ కార్యాలయాన్ని సంప్రదించాలి. 
  • అలాగే ఆస్తి అమ్మిన వ్యక్తికి వారసత్వంగా వచ్చిందా.. వారుసులు ఎవరైనా ఉన్నారా.. అనేది తెలుసుకుని వారి వద్దనుంచి సంతకాలు తీసుకోవాలి. 
  • ఇవన్నీ తెలుసుకుని అన్నీ ఓకే అయితేనే రిజిస్టర్ అగ్రిమెంట్ చేయించుకోవడం మంచిది. 

ఎఫ్‌టీఎల్, బఫర్‌జోన్ సమీప ప్రాంతాలు

హైడ్రా ఏర్పాటైన తర్వాత ఎఫ్‌టీఎల్, బఫర్‌జోన్ లలో ఉండే అక్రమ నిర్మాణాలను కూల్చివేయడం చూస్తున్నాం. అందువల్ల ఈ విషయంపై చాలా అప్రమత్తంగా ఉండాలి. 

  • కొందరు లేక్ వ్యూ ప్లాట్లు అంటూ మభ్యపెడుతుంటారు. అలాంటి సమయంలో జాగ్రత్తగా ఉండాలి. 
  • సాగునీటి శాఖ ఎన్‌ఓసీతో హెచ్‌ఎండీఏ అనుమతులు ఇచ్చినప్పటికీ అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ప్రస్తుతం రాష్ట్రంలో ఇలాంటి ప్రశ్నలతోనే వివాదాలు కొనసాగుతున్నాయి. 
  • హెచ్ఎండీఏ పరిధిలో అయితే మాస్టర్‌ప్లాన్-2030 తీసుకోవాలి. కొనుక్కునే ప్లాట్ ఏ జోన్‌లో ఉందో ఒకటికి రెండు సార్లు పరిశీలించాలి.
  •  ముఖ్యంగా మీరు కొనుక్కునే స్థలం లేదా ఇల్లు చెరువు సమీపంలో ఉంటే ఇంకాస్త జాగ్రత్తగా పరిశీలించాలి. 
  • అయితే దాన్ని ఎలా చెక్ చేసుకోవాలనుకుంటున్నారా? మీ మండల రెవెన్యూ కార్యాలయానికి వెళ్లండి. అక్కడ మీ సర్వే నెంబర్ ఆధారంగా చెరువు ఎఫ్‌టీఎల్ లేదా బఫర్‌జోన్ పరిధిలో ఉందో లేదో తెలుసుకోవచ్చు. దీని ద్వారా మీరు జాగ్రత్త పడే అవకాశం ఉంటుంది. 

అన్ని చెరువుల వివరాలు తెలుసుకోండిలా?

  • ముందుగా హెచ్‌ఎండీఏకు అఫీషియల్‌ వెబ్ ‌సైట్ https://lakes.hmda.gov.in/ లోకి వెళ్లాలి. 
  • జిల్లా, మండలం, గ్రామం సెలెక్ట్ చేసుకోవాలి.
  •  మీ సర్వే నెంబర్ ఆధారంగా ఊరిలో ఉన్న అన్ని చెరువుల వివరాలు తెలుసుకోవచ్చు.
  •  అలాగే ఎఫ్‌టీఎల్ కాలమ్‌లో క్లిక్ అని బ్లూ కలర్ ఉన్న దాన్ని క్లిక్ చేయగానే మ్యాప్ ఓపెన్ అవుతుంది. 
  • దీంతో ఎఫ్‌టీఎల్ వరకు చెరువు విస్తీర్ణం ఎంత.. పరిసర ప్రాంతాల్లో ఏమేమి ఉన్నాయి తెలుస్తుంది. 
  •  ఆపై బ్యాక్ బటన్ క్లిక్ చేసి క్యాడస్ట్రల్ సెలెక్ట్ చేసుకోవాలి. దీంతో మరో మ్యాప్ ఓపెన్ అవుతుంది.
  •  అప్పుడు ఆ చెరువు ఏఏ సర్వే నెంబర్ల పరిధిలో ఉందో కనిపిస్తుంది. 
  • మ్యాప్‌లో బ్లూ కలర్ లైన్‌తో ఉన్నదంతా ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉన్నదని అర్థం.
  •  రెడ్ కలర్‌తో ఉన్నది బఫర్ జోన్.
  • చెరువు కట్ట ఆరెంజ్ కలర్‌తో ఉంటుంది. 
  • దాని ప్రకారం మీ స్థలం లేదా అపార్ట్‌మెంట్ చెరువుకు ఎటువైపు ఉందో చూడొచ్చు. 
  • ఒకవేళ వీటి మధ్యలో ఉండి వాటి అనుమతులు ఉన్నా కొనుక్కోపోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. 

Also Read :  ఇద్దరు పిల్లలను బావిలో తోసేసిన తండ్రి.. ఆ తర్వాత దారుణం

#hydra #hmda
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe