/rtv/media/media_files/2025/10/08/ts-election-2025-10-08-17-52-42.jpg)
స్థానిక సంస్థల ఎన్నికలకు తెలంగాణ హైకోర్టు లైన్ క్లియర్ చేసింది. అక్టోబర్ 9వ తేదీ ఉదయం 10 : 30 గంటలకు ఫస్ట్ ఫేజ్ నోటిఫికేషన్ రిలీజ్ కానుంది. మొదటి విడతలో ఎంపీటీసీ, జడ్పీటీసీకు ఎన్నికలు జరగనున్నాయి. ఫస్ట్ ఫేజ్ లో 2,963 ఎంపీటీసీ స్థానాలకు.. 292 జెడ్పీటీసీ స్థానాలకు నోటిఫికేషన్ రిలీజ్ కానుంది. నామినేషన్లు దాఖలు చేయడానికి మూడు రోజులు మాత్రమే సమయం ఉంది. అక్టోబర్ 9వ తేదీ నుంచి అక్టోబర్ 11వరకు నామినేషన్ల స్వీకరిస్తారు. అక్టోబర్ 23వ తేదీన పోలింగ్, ఓట్ల లెక్కింపు నవంబర్ 11న జరగనుంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు రాష్ట్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో జరుగుతాయి. సుమారు 3000 - 4000 జనాభా నివసించే గ్రామీణ ప్రాంతాలను కలిపి ఒక ఎంపీటీసీగా ఏర్పాటు చేస్తారు. అలాగే, జిల్లా పరిషత్‌ల ఎన్నికల కోసం ప్రతి మండలాన్ని ఒక జెడ్పీటీసీ స్థానంగా పరిగణిస్తారు. రాజకీయ పార్టీలు ఈ ఎన్నికల్లో తమ అభ్యర్థులను నిలబెట్టవచ్చు.
ఉండాల్సిన అర్హతలు
ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే అభ్యర్థులకు ఉండాల్సిన ప్రధాన అర్హతలు సాధారణంగా పంచాయతీరాజ్ చట్టం ప్రకారం నిర్ణయించబడతాయి.
- అభ్యర్థి తప్పనిసరిగా భారత పౌరుడై ఉండాలి.
- నామినేషన్ తేదీ నాటికి 21 సంవత్సరాలు నిండి ఉండాలి
- అభ్యర్థి తాను పోటీ చేయదలుచుకున్న నియోజకవర్గం (మండలం లేదా జిల్లా) పరిధిలోని ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకుని ఉండాలి.
- ఎంపీటీసీ అయితే మండలానికి చెందిన ఓటరు, జెడ్పీటీసీ అయితే జిల్లాకు చెందిన ఓటరు అయి ఉండాలి.
- ప్రభుత్వ ఉద్యోగి కాకూడదు.
- సింగరేణి, ఆర్టీసీ వంటి ప్రభుత్వ రంగ సంస్థల్లో మేనేజింగ్ ఏజెంట్, మేనేజర్ లేదా సెక్రటరీ హోదాలో పనిచేసేవారు కూడా అనర్హులు.
- రేషన్ డీలర్లు కూడా పోటీ చేయడానికి అర్హులు.
- స్థానిక సంస్థలకు చెల్లించాల్సిన పన్ను బకాయిలు లేదా ఇతర ప్రభుత్వ బకాయిలు ఉన్నవారు కూడా పోటీకి అనర్హులు
- ఇద్దరి కంటే ఎక్కువ సంతానం ఉన్నవారు అనర్హులు. ( 1995, మే 31 నాటి చట్టం ప్రకారం
)