Lady Aghori: అఘోరీ ఇంటి వద్ద హైటెన్షన్.. పోలీసుల లాఠీచార్జ్

అఘోరీ ఇంటి వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. అఘోరీని చూసేందుకు వేలాదిగా జనం తరలివస్తున్న వస్తున్నారు. అఘోరీ ఇంటికి 100 మీట్లర్ల దూరంలోనే పోలీసులు వారిని ఆపేస్తున్నారు. ఇక ఆమెను కలిసేందుకు ప్రయత్నించిన వారిపై పోలీసులు లాఠీచార్జ్ చేసినట్లు తెలుస్తోంది.

New Update
Lady Aghori

అఘోరీ ఇంటి దగ్గర టెన్షన్ వాతావరణం నెలకొంది. మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం కుషన్‌పల్లిలోని అఘోరీని చూసేందుకు వేలాదిగా జనం తరలివస్తున్న వస్తున్నారు. దీని కారణంగా పోలసులు భారీగా భద్రత కట్టుదిట్టం చేశారు.

పోలీసుల లాఠీచార్జ్

అఘోరీతో ఎవరినీ కలవనివ్వడం లేదు. అఘోరీ ఇంటికి 100 మీట్లర్ల దూరంలోనే పోలీసులు వారిని ఆపేస్తున్నారు. ఇక ఆమెను కలిసేందుకు ప్రయత్నించిన వారిపై పోలీసులు లాఠీచార్జ్ చేసినట్లు తెలుస్తోంది. దీంతో పోలీసులపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం.

ఇది కూడా చదవండి: పొంగులేటికి షాక్ ఇచ్చిన సీనియర్లు.. ఆ అంశాలపై హైకమాండ్ కు ఫిర్యాదు! 

ఆత్మార్పణ ప్రకటన

కాగా అఘోరీ ఇంటి వద్ద భద్రతను ఏసీపీ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. అఘోరీ బయటకు రాకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. అంతేకాకుండా అఘోరీని కలిసేందుకు పోలీసులు ఎవరికీ అనుమతివ్వడం లేదు. ఇటీవలే సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఆలయం వద్ద ఆత్మార్పణ చేసుకుంటానని అఘోరీ ప్రకటన చేసిన విషయం అందరికీ తెలిసిందే. 

ఇది కూడా చదవండి: త్వరలోనే పాదయాత్ర.. కేటీఆర్ సంచలన ప్రకటన!

అఘోరీ ఆత్మార్పణకు డెడ్‌లైన్‌ ముగిసింది

ఈ నేపథ్యంలో అలెర్ట్ అయిన పోలీసులు అఘోరీని అదుపులోకి తీసుకొని ఆమె స్వగ్రామానికి తీసుకెళ్లారు. ఆత్మార్పణ చేసుకుంటానని చెప్పడంతో ముందస్తు జాగ్రత్తగా అఘోరీని ఇంటి నుంచి బయటకు రాకుండా నిర్బంధించారు. హైదరాబాద్‌కు వెళ్తుండగా అర్ధరాత్రి సిద్దిపేటలో అఘోరీని అదుపులోకి తీసుకున్నారు. భారీ ఎస్కాట్ మధ్య అఘోరీని మంచిర్యాల జిల్లాలోని తన స్వగ్రామమైన కుషనపల్లికి తీసుకెళ్లి తన తల్లిదండ్రుల వద్దకు చేర్చారు. ఇక అఘోరీ ఆత్మార్పణకు డెడ్‌లైన్‌ ముగియడంతో ఆమె నెక్స్ట్ ఏం చేస్తుందా? అని అంతా ఆతృతగా ఎదురుచూస్తున్నారు. 

ఇది కూడా చదవండి: మేమంతా ఒకే పిడికిలి.. రిటెన్షన్‌ పై హార్దిక్‌ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

కాగా తెలంగాణలో లేడీ అఘోరీ గత కొన్ని రోజులుగా హాట్ టాపిక్‌గా మారింది. నగ్నంగా పలు ఆలయాలు సందర్శిస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆమెను చాలా మీడియాలు ఇంటర్వ్యూ చేశాయి. ఆపై మళ్లీ కేదరినాథ్ వెళ్లిపోయిన ఆ లేడీ అఘోరీ మళ్లీ తిరిగి అక్టోబర్ 29న వస్తానని తెలిపింది. ఆమె అనుకున్నట్లుగానే అక్టోబర్ 29న తెలంగాణకు తిరిగి వచ్చింది. 

ఇది కూడా చదవండి: సమీపిస్తున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు.. ఎంతమంది బరిలో ఉన్నారంటే

సనాతన ధర్మంపై పోరాటం చేస్తానని.. అందులో భాగంగానే తాను ఆత్మార్పణ చేసుకుంటానని తెలిపింది. ఈ ఆత్మార్పణలో తాను చనిపోతే శివుని దగ్గరకు వెళ్లిపోతానని.. చావకపోతే సనాతన ధర్మాన్ని మరింత ముందుకు తీసుకెళ్తానని తెలిపింది. ఈ మేరకు సికింద్రాబాద్‌లోని ముత్యాలమ్మ ఆలయంలో అక్టోబర్ 31న ఆత్మార్పణ చేసుకుంటానని తెలిపింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు