Telangana Weather: హైదరాబాద్‌ను ముంచెత్తిన భారీ వర్షం.. రాష్ట్రానికి ఆరెంజ్ అలర్ట్ జారీ

మొంథా తుపాను ప్రభావంతో  తెలంగాణ రాజధాని నగరం హైదరాబాద్‌ రాత్రి నుంచి కురుస్తున్న వానతో తడచిముద్దయింది. హైదరాబాద్ వాసులు ఈ ఉదయం భారీ వర్షంతోనే నిద్రలేచారు. నగరంలోని పలు ప్రాంతాల్లో రాత్రి నుంచే వర్షం కురుస్తుండగా, తెల్లవారుజాము నుంచి కుండపోతగా మారింది.

New Update
Heavy rains inundate Hyderabad.

Heavy rains inundate Hyderabad.

Telangana Weather: మొంథా తుపాను(Cyclone Montha) ప్రభావంతో  తెలంగాణ రాజధాని నగరం హైదరాబాద్‌ రాత్రి నుంచి కురుస్తున్న వానతో తడచిముద్దయింది. హైదరాబాద్ వాసులు ఈ ఉదయం భారీ వర్షంతోనే నిద్రలేచారని చెప్పచ్చు. నగరంలోని పలు ప్రాంతాల్లో రాత్రి నుంచే వర్షం కురుస్తుండగా, తెల్లవారుజాము నుంచి కుండపోతగా వర్షం కురుస్తోంది. ఇదిలా ఉండగా, రానున్న మరి కొన్ని గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరించింది. ఈ మేరకు తెలంగాణకు 'ఆరెంజ్ అలర్ట్' జారీ చేసింది. తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో 180 మి.మీ. వరకు వర్షపాతం నమోదు కావచ్చని అంచనా వేసింది. నగరంలో రోజంతా అడపాదడపా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలపింది. వాతావరణ శాఖ సూచన ప్రకారం, రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రేపు కూడా భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తూ, ఆ రోజుకు 'ఎల్లో అలర్ట్' ప్రకటించింది.

మొంథా తుఫాన్ ఎఫెక్ట్‌తో హైదరాబాద్‌లో వాన దంచికొడుతుంది.నగరంలోని జూబ్లీహిల్స్, మాదాపూర్, గచ్చిబౌలి, కూకట్‌పల్లిలో కుండపోతగా  వర్షం కురుస్తోంది. ఎల్బీనగర్, దిల్‌సుఖ్‌నగర్, నాగోల్ రహదారులు వర్షపునీటితో నిండిపోయాయి. ఆఫీసులకు వెళ్లే సమయం కావడంతో వాహనదారుల ఇబ్బందులు పడుతున్నారు.ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ జామ్‌తో తీవ్ర అవస్థలు తప్పడం లేదు.


మొంథా తుపాను ప్రభావం

మొంథా తీరాన్ని తాకడంతో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని 'తెలంగాణ వెదర్‌మ్యాన్' తెలిపారు. ముఖ్యంగా ఆదిలాబాద్, కుమ్రం భీం ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల,  పెద్దపల్లి, కరీంనగర్, సిద్దిపేట, హనుమకొండ, వరంగల్, జనగామ, యాదాద్రి భువనగిరి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, మహబూబాబాద్, సూర్యాపేట, ఖమ్మం, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని ఆయన వివరించారు. కొన్ని ప్రాంతాల్లో 80 నుంచి 180 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేశారు.

ఇక హైదరాబాద్ విషయానికొస్తే, బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు అడపాదడపా ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని ఆయన పేర్కొన్నారు. ఐఎండీ సైతం నగరంలో మోస్తరు వర్షాలతో పాటు బలమైన గాలులు వీస్తాయని తెలిపింది. అక్టోబర్ 30 నుంచి నవంబర్ 1 వరకు ఉదయం పూట పొగమంచు లేదా మబ్బులతో కూడిన వాతావరణం ఉంటుందని వెల్లడించింది. భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్రయాణాలు చేసేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు