Bandaru Dattareya: హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కాన్వాయ్ రోడ్డు ప్రమాదానికి గురైంది. హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఆదివారం రాత్రి.. హైదరాబాద్ నుంచి బయలుదేరిన దత్తాత్రేయ కాన్వాయ్‌కు.. ఆకస్మాత్తుగా ఓ వ్యక్తి అడ్డుగా వచ్చాడు. దీంతో వెంటనే డ్రైవర్ సడెన్ బ్రేక్ వేశాడు. దీంతో.. వెనుక వస్తున్న 3 వాహనాలు ఒక్కదానికొకటి వరుసగా వేగంగా ఢీకొట్టుకున్నాయి.
Also Read: ఎక్కువమందిని కంటేనే ఎన్నికల్లో ఛాన్స్.. చంద్రబాబు సంచలన ప్రకటన!
రోడ్డు ప్రమాదం..
ఈ ఘటనలో బండారు దత్తాత్రేయకు ఎలాంటి ప్రమాదం కాకపోవటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్లేందుకు శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వెళ్తున్న క్రమంలో.. ప్రధాన రహదారిలో ఈ రోడ్డు ప్రమాదం జరిగిందని పోలీసులు వెల్లడించారు. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు.. హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో మూడు వాహనాలు స్వల్పంగా ధ్వంసం కాగా.. వాహనాల్లో ఉన్న వ్యక్తులకు ఎలాంటి ప్రమాదం జరగలేదు.
అలయ్ బలయ్..
ఈ ప్రమాదం గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. అయితే.. ఏటా జరిపినట్టుగానే ఈసారి దసరా పండుగకు హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో అట్టహాసంగా అలయ్ బలయ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రస్తుతం దత్తాత్రేయ.. గవర్నర్‌గా ఉండటంతో.. ఈ కార్యక్రమ బాధ్యతలను ఆయన కుమార్తె విజయలక్ష్మి చూసుకుంటున్నారు. ఈసారి నిర్వహించిన అలయ్ బలయ్ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన దత్తాత్రేయ.. తిరిగి ఈరోజే వెళ్తున్న క్రమంలోనే.. ఈ ప్రమాదం జరిగింది.
Also Read: మరికొన్ని గంటల్లో గ్రూప్-1 పరీక్ష.. సీఎం రేవంత్‌కు బండి సంజయ్ సంచలన లేఖ
కాగా.. ఇటీవల నిర్వహించిన అలయ్ బలయ్ కార్యక్రమంలో.. హర్యాన గవర్నర్ బండారు దత్తాత్రేయ రాజకీయాల గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలకు అతీతంగా అలయ్ బలయ్ నిర్వహించుకోవాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించామని అన్నారు. అలయ్ బలయ్‌కి రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. తెలుగు రాష్ట్రాల సీఎంలు పరస్పరం ఐకమత్యంతో పనిచేయాలని.. రెండు రాష్ట్రాలను అన్ని రంగాల్లో మొదటి స్థానంలో ఉంచాలని హర్యానా గవర్నర్ దత్తాత్రేయ కోరారు. తాను వేరే రాష్ట్రం గవర్నర్ అయినా తెలంగాణ బిడ్డనే అని చెప్పుకొచ్చారు.
Also Read: ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం ఉండాలి: రష్యా
అలయ్ బలయ్‌కి వస్తానని ఇచ్చిన మాటను సీఎం రేవంత్ రెడ్డి నిలబెట్టుకున్నారని చెప్పారు.
Also Read: 2027లోనే జమిలి ఎన్నికలు.. సిద్ధమవుతున్న కేంద్ర ప్రభుత్వం !