హర్షసాయికి బిగుస్తున్న ఉచ్చు.. లుక్‌అవుట్‌ నోటీసులు జారీ!

యూట్యూబర్ హర్షసాయికి ఉచ్చు బిగుస్తోంది. లైంగిక ఆరోపణల కేసు దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగానే నార్సింగి పోలీసులు లుక్‌అవుట్ నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. పరారీలో ఉన్న హర్షసాయి కోసం గాలిస్తున్నారు.

dededdd
New Update

Harsha Sai : యూట్యూబర్ హర్షసాయికి ఉచ్చు బిగుస్తోంది. లైంగిక ఆరోపణల కేసు దర్యాప్తు ముమ్మరం చేయగా.. నార్సింగి పోలీసులు లుక్‌అవుట్ నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. పరారీలో ఉన్న హర్షసాయి కోసం గాలిస్తున్నారు.

పిటిషన్ కొట్టివేత.. 

ఇదిలా ఉంటే.. ఈ కేసులో ముందస్తు బెయిల్‌ కోసం దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. హర్ష సాయి తండ్రి రాధాకృష్ణ, ఇమ్రాన్ హైకోర్టును ఆశ్రయించి.. తమను పోలీసులు అరెస్ట్ చేయకుండా ఉండేలా ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసును ఈరోజు విచారించిన ధర్మాసనం.. కేసులో నిందితులుగా చేర్చకముందే ముందస్తు బెయిల్ ఎలా మంజూరు చేస్తారని ప్రశ్నించింది. వారు దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ కొట్టి వేసింది. కేసులో నిందితులుగా చేర్చిన తర్వాత ముందస్తు బెయిల్‌కు రావాలని వారికి సూచనలు చేసింది. 

ఇటీవల ఓ యువతి తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి యూట్యూబర్ హర్ష సాయి మోసం చేశాడని నార్సింగి పోలీసు స్టేషన్‌‌లో కేసు పెట్టింది. హర్ష సాయితో పాటు అతని తండ్రిపై కూడా  కంప్లైంట్ ఇచ్చింది. పెళ్లి పేరుతో రూ. 2కోట్లు తీసుకొని తనను  మోసం చేసినట్లు యువతి ఫిర్యాదులో పేర్కొంది. దీంతో పోలీసులు హర్ష సాయిపై 376, 354 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 

Also Read :  భార్యపై 92 రేప్ లు చేయించిన భర్త కేసు.. కోర్టు కీలక నిర్ణయం

#tollywood #harsha-sai
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe