Telangana Group 1: గ్రూప్-1 నోటిఫికేషన్‌పై దాఖలైన పిటిషన్లపై హైకోర్టులో విచారణ ముగిసింది. అయితే తీర్పును రిజర్వ్ చేసినట్లు హైకోర్టు ప్రకటించింది. దీంతో గ్రూప్ -1 అభ్యర్థుల్లో మరోసారి ఉత్కంఠ నెలకొంది. కీ లో తప్పులు , రీ నోటిఫికేషన్, ఎస్టీ రిజర్వేషన్ ప్రకారం మెరిట్ జాబితాను మళ్లీ విడుదల చేయాలని పలువురు అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. అన్ని అభ్యంతరాలను పరిశీలించిన తర్వాతే తుది కీని విడుదల చేశామని టీజీపీఎస్సీ కోర్టుకు తెలిపింది. గ్రూప్ -1 మెయిన్స్ పరీక్షలు అక్టోబర్ 21వ తేదీ నుంచి ఉండటంతో ఈ కేసు విచారణకు హైకోర్టు ప్రాధాన్యమిచ్చింది.
Also read: దామగుండం ఫారెస్టులో బతుకమ్మ కార్యక్రమానికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. 563 పోస్టుల భర్తీకి గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. ఇందులో జనరల్ పోస్టులు 200 ఉండగా.. ఈడబ్ల్యూఎస్ 49, బీసీ(ఏ) 44, బీసీ (బీ)37, బీసీ(సీ) 13, బీసీ(డీ) 22, బీసీ(ఈ) 16, ఎస్సీ 93, ఎస్టీ 52, క్రీడాకారులు 4, దివ్యాంగులు 24 పోస్టులు చొప్పున ఉన్నాయి. అన్ని క్యాటగిరీలకు 1:50 నిష్పత్తి చొప్పున ఎంపికలో సర్వీస్ కమిషన్ విఫలమైందని.. రిజర్వేషన్ క్యాటగిరీ అభ్యర్థులకు నష్టం జరుగుతోందని పలువురు అంటున్నారు.