/rtv/media/media_files/2025/01/27/1lNE3cgfnHre8pc25Os9.jpg)
Rythu Bharosa
Rythu Bharosa : అటు సర్పంచ్ ఎన్నికలు, ఇటు మున్సిపల్ ఎన్నికల్లో ఘననీయమైన విజయాలు నమోదు చేసుకున్న అధికార కాంగ్రెస్ పార్టీ త్వరలోనే రైతులకు గుడ్ న్యూస్ చెప్పడానికి సిద్ధమైంది. ఇటు మున్సిపల్ ఎన్నికలు ముగియడం, త్వరలో మండల, జిల్లా పరిషత్ ఎన్నికలు ఉండటంతో ఈ మధ్యలోనే రైతుభరోసా పథకం కింద పెట్టుబడి సాయాన్ని రైతుల ఖాతాల్లో జమ చేయాలని నిర్ణయించింది. నిజానికి ఇప్పటికే రైతుభరోసా నిధులు జమ చేయాల్సి ఉండగా నిధులు లేవన్న కారణంతో ఇప్పటివరకు రైతుభరోసా విడుదల చేయలేదు. దీంతో ప్రస్తుతం యాసంగి సీజన్‌కు సంబంధించి.. రైతు భరోసా నిధుల విడుదలకు ప్రభుత్వం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ప్రతి రైతుకు ఎకరానికి రూ.6,000 చొప్పున అర్హులైన రైతులకు ఈ సాయాన్ని అందించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రభుత్వ సమాచారం ప్రకారం ఫిబ్రవరి 17 తేదీన రైతు భరోసా నిధులు జమచేయనున్నట్లు తెలుస్తోంది.
కాగా, ఈ విషయానికి సంబంధించి చర్చించడానికి ఈరోజు (శనివారం) సాయంత్రం 6 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి తన నివాసంలో మంత్రులతో కీలక సమావేశం నిర్వహించనున్నారని తెలుస్తోంది. ఈ సమావేశంలో రైతు భరోసా నిధుల విడుదలతో పాటు స్థానిక ఎన్నికలకు సంబంధించిన అంశాలపై చర్చించే అవకాశం ఉందని చెబుతున్నారు. అలాగే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణకు కూడా ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించడంతో అదే ఊపుతో కాంగ్రెస్ పార్టీ మరింత బలంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించేందుకు పావులు కదుపుతుంది.
Follow Us