/rtv/media/media_files/2025/03/11/obI8rxygC8REv9qrtKm9.jpg)
Balkampet-Ellamma-Temple
Balkampet temple : హైదరాబాద్ మహా నగరంలో ఉన్న ప్రముఖ ఆలయాల్లో బల్కంపేట రేణుకా ఎల్లమ్మ ఆలయం ఒకటి. ఆ ఆలయానికి కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. దేశంలో ఆలయాల అభివృద్ధి, టెంపుల్ టూరిజం కోసం కేంద్రం ప్రభుత్వం కొత్తగా 'ప్రసాద్' పథకం తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా కొత్తగా తీసుకొచ్చిన ‘ప్రసాద్’ పథకం కింద హైదరాబాద్‌లోని బల్కంపేట రేణుకా ఎల్లమ్మ దేవస్థానంలో అభివృద్ధి పనులకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టు వివరాలను స్వయంగా ఎక్స్ వేదికగా కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షేకావత్ వెల్లడించారు. ఈ ప్రాజెక్టు ద్వారా రూ. 4.21 కోట్ల వ్యయంతో, ఒకేసారి 200 మందికి పైగా వసతి కల్పించే ఆధునిక సౌకర్యాలతో కూడిన 3 అంతస్తుల అన్నదాన భవనాన్ని అభివృద్ధి చేస్తామని ప్రకటించారు.అందుకు సంబంధించిన నమూనా ఫోటోను ట్విట్టర్‌లో రిలీజ్ చేశారు.
ఇది కూడా చూడండి: Lalit Modi: 'వనువాటు అందమైన దేశం'.. లలిత్ మోదీ సంచలన పోస్ట్
ఈ ఆలయానికి నగరవాసులే కాకుండా ఇతర జిల్లాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారు. బోనాలు, ఆలయ బ్రహ్మోత్సవాల సమయంలో వేల సంఖ్యలో భక్తులు ఆలయాన్ని సందర్శిస్తుంటారు. అయితే ప్రస్తుతం అక్కడ సరైన సౌకర్యాలు లేవు. ఈ నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఆలయ రూపురేఖలు మార్చేలా అభివృద్ధి చేసేందుకు రెడీ అయ్యారు. అందులో భాగంగా ప్రసాద్ పథకం కింద బల్కంపేట దేవాలయాన్ని అభివృద్ధి చేస్తారు.ఆలయాల అభివృద్ధికి, ఆధ్యాత్మికతకు నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ సదర్భంగా కేంద్ర మంత్రి వెల్లడించారు. కాగా, గతంలో వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయాన్ని కూడా ప్రసాద్ పథకంలో చేర్చారు. ఈ పథకం ద్వారా ఆలయంలో 100 గదుల సామర్థ్యం గల అతిథి గృహం, అన్నప్రసాద భవనం, క్యూ కాంప్లెక్స్‌ల అభివృద్ధికి ఆమోదం తెలిపారు.
Also Read: చైనా సైంటిస్టుల అద్భుతం.. గుండెపోటు, స్ట్రోక్స్ రాకుండా వ్యాక్సిన్!
ప్రసాద్ పథకంలో బల్కంపేట ఎల్లమ్మ ఆలయాన్ని చేర్చటంపై కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. రేణుకా ఎల్లమ్మ ఆలయ అభివృద్ధి ప్రాజెక్టుకు నిధులు కేటాయించినందుకు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షేకావత్‌లకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. కేంద్ర నిర్ణయం ద్వారా భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందుతాయని చెప్పారు. హైదరాబాద్ నగరంలో ఆలయం ఆధ్యాత్మిక వారసత్వాన్ని కాపాడటానికి కూడా కేంద్రం నిర్ణయం దోహదపడుతుందన్నారు. తెలంగాణ రాష్ట్రం, దేవాలయాల అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని చెప్పారు.
ఇది కూడా చూడండి: Horoscope Today: నేడు ఈ రాశివారికి అసలు బాలేదు..కాస్త జాగ్రత్తగా ఉండండి!
Today, our Ministry of Tourism has approved development work to be undertaken at Goddess Renuka Yellamma Devasthanam, Balkampet, Hyderabad in Telangana under the PRASHAD scheme.
— Gajendra Singh Shekhawat (@gssjodhpur) March 10, 2025
At a cost of Rs 4.21 Cr, a 3-storey annadana building with modern amenities to accommodate over 200… pic.twitter.com/8VF9cV1q9I