దారుణం.. 13ఏళ్ల బాలికపై గ్యాంగ్ రేప్.. చేసింది మరెవరో కాదు..! వికారాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. ఎనిమిదవ తరగతి చదువుతున్న 13 ఏళ్ల బాలికపై నలుగురు మైనర్లు అత్యాచారానికి పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు దోమ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు నలుగురు మైనర్లను అరెస్టు చేశారు. By Seetha Ram 01 Nov 2024 in తెలంగాణ క్రైం New Update షేర్ చేయండి అమ్మాయిలపై లైంగిక దాడులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. పోలీసులు ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా కామాంధులు మాత్రం అంతకంతకు రెచ్చిపోతున్నారు. అమాయకుల జీవితాన్ని నాశనం చేస్తున్నారు. చిన్నా పెద్దా తేడా లేకుండా అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. తాజాగా అలాంటి ఘటనే ఒకటి జరిగింది. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా నలుగురు మైనర్లు ఎనిమిదో తరగతి చదువుతున్న బాలికపై లైంగిక దాడి చేశారు. వికారాబాద్‌లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఇది కూడా చదవండి: పొంగులేటికి షాక్ ఇచ్చిన సీనియర్లు.. ఆ అంశాలపై హైకమాండ్ కు ఫిర్యాదు! 13 ఏళ్ల బాలికపై అత్యాచారం వికారాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. 8వ తరగతి చదువుతున్న 13 ఏళ్ల బాలికపై అత్యాచారం జరిగింది. ఏకంగా నలుగురు మైనర్లు ఆ బాలికపై లైంగిక దాడి చేశారు. ఇక రోజు ఎంతో చెలాకిగా ఆడుతూ పాడుతూ తిరిగే ఆ బాలిక.. అత్యాచారం జరిగిన తర్వాత నుంచి సైలెంట్ అయిపోయింది. నీరసంగా కనిపించడంతో ఒంట్లో బాలేదేమో అని తల్లిదండ్రులు భావించారు. ఆ తర్వాత అనుమానం వచ్చి గట్టిగా అడగడంతో ఆ బాలిక అసలు విషయం చెప్పేసింది. ఇది కూడా చదవండి: త్వరలోనే పాదయాత్ర.. కేటీఆర్ సంచలన ప్రకటన! దీంతో వెంటనే తల్లిదండ్రులు సమీపంలోని దోమ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఆ బాలిక చెప్పిన వివరాల ఆధారంగా పోలీసులు నలుగురు మైనర్లను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అనంతరం బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వ హాస్పిటల్‌కి తరలించారు. అయితే ఈ కేసుకు సంబంధించి నిందితులు నలుగురూ మైనర్లు కావడంతో పోలీసులు ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. అలాంటిదే మరో ఘటన ఇది కూడా చదవండి: మేమంతా ఒకే పిడికిలి.. రిటెన్షన్ పై హార్దిక్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ తాజాగా సంగారెడ్డి జిల్లాలో కూడా ఓ దారుణం జరిగింది. ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన ఓ యువకుడు ప్రేమిస్తున్నట్లు నమ్మించి మైనర్ బాలికపై అత్యాచారం చేశాడు. వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం జివంగి గ్రామానికి చెందిన 19ఏళ్ల వినీల్‌కి.. న్యాల్కల్‌కి చెందిన 16 ఏళ్ల బాలికతో ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం ఏర్పడింది. ఇది కూడా చదవండి: సమీపిస్తున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు.. ఎంతమంది బరిలో ఉన్నారంటే ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఇద్దరూ పీకల్లోతు ప్రేమలో మునిగిపోయారు. అదే సమయంలో ఆ బాలిక గ్రామానికి వచ్చిన ఆ యువకుడు మాయమాటలు చెప్పి అత్యాచారం చేశాడు. దీంతో ఆ బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు ఆ యువకుడిని అరెస్టు చేశారు. #gang rape update news #crime-telangana మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి