/rtv/media/media_files/2025/01/31/acoSheNk8LeHvWF7Quc0.webp)
Osmania General Hospital
Osmania General Hospital : తెలంగాణ వైద్యారోగ్య చరిత్రలో మరో కొత్త మైలురాయికి నేడు ప్రభుత్వం శ్రీకారం చుట్దింది. నిజాం కాలంలో నిర్మితమై వందలేండ్లుగా తెలంగాణతో పాటు పరిసర రాష్ట్రాల ప్రజలకు సేవలందించిన ఉస్మానియా ఆసుపత్రి నూతన భవన నిర్మాణానికి నేడు భూమి పూజ నిర్వహించనున్నారు. ప్రస్తుతం తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ తదితర రాష్ట్రాల ప్రజలకు వైద్య సేవలందిస్తున్న ఉస్మానియా పెద్దాసుపత్రి శిథిలావస్థకు చేరుకుంది. కాగా ఈ భవనాన్ని కూల్చివేసి నూతన భవనం నిర్మించాలని చాలాకాలం నుంచి ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తున్నాయి. కానీ అనేక కారణాల వల్ల అది సాధ్యం కాలేదు. అయితే ప్రస్తుతం అధికారంలో ఉన్న రేవంత్ రెడ్డి సర్కార్ ఈ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. నూతన భవన నిర్మాణాన్ని చేపట్టాలని నిర్ణయించింది. అందులో భాగంగా ఆసుపత్రి భవన నిర్మాణ నమూనాను కూడా రూపొందించింది. ఈ మేరకు శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నూతన భవన నిర్మాణానికి భూమి పూజ చేయనున్నారు.
Also Read: TG, AP MLC Elections: తెలంగాణ, ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్.. వివరాలివే!
అయితే పాత ఆసుపత్రిని కూల్చి నూతన భవనం నిర్మించాలని గతంలో ప్రభుత్వాలు ప్రయత్నించినప్పటికీ హెరిటెజ్ భవనం పేరుతో పలువురు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. దీంతో ప్రస్తుతం అఫ్జల్ గంజ్‌లో ఉన్న ఆసుపత్రిని అలాగే ఉంచి నూతన ఆసుపత్రిని గోషామహల్ స్టేడియంలో నిర్మించనున్నారు. 2 వేల పడకల సామర్ధ్యంతో మొత్తం 32 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నూతన ఆసుపత్రిని నిర్మించనున్నారు. 26 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించనున్న ఉస్మానియా ఆసుపత్రి కొత్త భవనాలు.. కార్పొరేట్ ఆసుపత్రులకు ఏమాత్రం తీసిపోకుండా వాటిని తలదన్నేలా ఉండాలని ప్రభుత్వం నిర్ణయించింది.
Also Read: NAGOBA JATARA : నాగోబా జాతరలో నేడు కీలక ఘట్టం... దర్బార్ కు నేటికి ఎన్నేండ్లంటే...?
వచ్చే నూరేళ్ల అవసరాలకు తగినట్లు ఉస్మానియా ఆసుపత్రిని నిర్మించాలని ప్రభుత్వం సంకల్పించిది. ఈ మేరకు దానికి తగినట్లు నిర్మాణాలు చేపట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అందుకు అనుగుణంగా.. అన్నిరకాల సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు, ప్రతి డిపార్ట్‌మెంట్‌కు ప్రత్యేకంగా ఆపరేషన్ థియేటర్లు, ప్రతి థియేటర్‌కు అనుబంధంగా పోస్ట్ ఆపరేటివ్, ఐసీయూ వార్డులు, గ్రౌండ్ ఫ్లోర్‌లో ఒకే చోట అన్నిరకాల డయాగ్నసిస్ సేవలు, అత్యాధునిక టెక్నాలజీతో కూడిన మార్చురీ, స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఫెసిలిటీస్ తో కూడిన ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంటేషన్ యూనిట్‌లకు రూపకల్పన చేశారు. అండర్ గ్రౌండ్ రెండు ఫ్లోర్‌లో పార్కింగ్, ఆసుపత్రి సమీపంలో ఫైర్ స్టేషన్, ఆసుపత్రి చుట్టూ విశాలమైన రహదారులు, ఆసుపత్రి ప్రాంగంణంలో ఎక్కిడికైనా ఈజీగా ఫైర్ ఇంజిన్లు, అంబులెన్స్‌లు తిరిగేందుకు వీలుగా నిర్మాణాలు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. దివ్యాంగులు ఆసుపత్రిలోకి రాకపోకలు సాగించేందుకు వీలుగా ర్యాంప్‌లు, ఆసుపత్రిలోని రోగులకు సహాయకులుగా వచ్చే వారు సేద తీరేందుకు డార్మెటరీలు, క్యాంటీన్, మరుగుదొడ్లు వంటి సమస్త సౌకర్యాలతో అత్యాధునికంగా నిర్మించనున్నారు.
Also Read: TG, AP MLC Elections: తెలంగాణ, ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్.. వివరాలివే!
తెలంగాణలో పురాతన ఆసుపత్రులుగా పేరున్న ఉస్మానియా, గాంధీ, ఎంజీఎం ఆసుపత్రులకు ప్రత్యామ్నాయంగా నూతన భవనాలు నిర్మించాలని గతంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం సంకల్పించింది. అందులో భాగంగా నగరానికి నాలుగు వైపుల నాలుగు ఆసుపత్రుల నిర్మాణాలను చేపట్టింది. ప్రస్తుతం అవి నిర్మాణ దశలోనే ఉన్నాయి. ఇక ఎంజీఎం ఆసుపత్రిని పాత జైలు ప్రాంతంలో నిర్మించాలని సంకల్పించింది. అయితే గత ప్రభుత్వం అధికారం కోల్పోవడం తో అవి ఆసారణ సాధ్యం కాలేదు. రేవంత్ సర్కార్ మొదలు పెట్టిన ప్రస్తుత ఉస్మానియా దవాఖాన మంచి గుర్తింపు తెచ్చుకుంటుందని ఆశిద్దాం.