ఈ-ఫార్ములా రేసు వ్యవహారంలో కేటీఆర్ పై తెలంగాణ ఏసీబీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏ క్షణమైనా కేటీఆర్ ను అరెస్ట్ చేస్తారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయమైన హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ఈ రోజు మధ్యాహ్నం తర్వాత అక్కడికి భారీగా పోలీసు బలగాలను తరలిస్తున్నారు. దీంతో కేటీఆర్ అరెస్ట్ నేపథ్యంలోనే ముందు జాగ్రత్త చర్యగా బలగాలను మోహరిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
Additional Police being deployed by Congress Government at Telangana Bhavan (BRS Party Office ) pic.twitter.com/Gm7JOrduPJ
— Krishank (@Krishank_BRS) December 19, 2024
తెలంగాణ భవన్ చుట్టూ భారీగా పోలీసుల మోహరింపు pic.twitter.com/obbLJZGXOX
— Telugu Scribe (@TeluguScribe) December 19, 2024
ఈ విషయమై బీఆర్ఎస్ కీలక నేత క్రిషాంక్ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశారు. పోలీసులు భారీగా మోహరించి ఉన్న వీడియోను ఆయన షేర్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అదనపు పోలీసులను తెలంగాణ భవన్ (బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయం) వద్ద మోహరించిందని పేర్కన్నారు. కేటీఆర్ నివాసం వద్దకు సైతం భారీగా పోలీసులు చేరుకుంటున్నట్లు తెలుస్తోంది.