నారాయణ పేట జిల్లా మాగనూరు జడ్పీ స్కూల్‌లో మళ్లీ ఫుడ్ పాయిజన్ జరిగింది. మధ్యాహ్న భోజనం వికటించి 15 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆ 15 మంది విద్యార్థులను మక్తల్ హాస్పిటల్‌కు స్కూల్ సిబ్బంది తరలించింది. ఇది వరకు ఇదే స్కూల్‌లో ఫుడ్ పాయిజన్ జరిగింది.
Also Read: ఊహించని రేంజ్‌లో ఐపీఎల్ బిజినెస్.. మూడు రెట్లు పెరిగిన పెట్టుబడి!
మళ్లీ ఐదు రోజుల వ్యవధిలోనే ఇలా మూడో సారి జరగడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మూడు రోజుల క్రితమే కలెక్టర్ ఆ స్కూల్‌లో ఆకస్మిక తనిఖీ చేశారు. వంట గది, స్కూల్ పరిసరాలు పరిశీలించి అసంతృప్తి వ్యక్తం చేశారు.
బ్రేకింగ్ న్యూస్
— Telugu Scribe (@TeluguScribe) November 26, 2024
దారుణం.. వారంలో మూడోసారి ఫుడ్ పాయిజన్
మక్తల్ - మాగనూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మళ్లీ ఫుడ్ పాయిజన్
మధ్యాహ్న భోజనం తిని 20 మంది విద్యార్థులకు వాంతులు
తల, కడుపు నొప్పితో విలవిలలాడిన విద్యార్థులు
మక్తల్ ఆస్పత్రికి 20 మంది విద్యార్థులను తరలింపు https://t.co/ccwYIyrNPIpic.twitter.com/WcgW23i64C
Also Read:ఐపీఎల్ వేలంలో అన్‌సోల్డ్‌గా మిగిలిన స్టార్ ఆటగాళ్లు
వెంటనే అన్ని రూమ్‌లు క్లీన్‌గా ఉండేలా చూడాలన్నారు. ముఖ్యంగా వంటగది క్లీన్‌గా ఉండేటట్లు చూడమని.. విద్యార్థులకు మంచి ఆహారం అందిమని చెప్పారు. అలా చేయని యెడలా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అయినా వారి తీరు మారలేదు. మళ్లీ అదే స్కూల్‌లో ఫుడ్‌పాయిజన్ అయింది.
కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు
— Telugu Scribe (@TeluguScribe) November 26, 2024
మక్తల్ - మాగనూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మళ్లీ ఫుడ్ పాయిజన్ https://t.co/uS3KEI2Wvwpic.twitter.com/6AQJh9frD5
ఇటీవల ఫుడ్ పాయిజన్
ఇటీవల బుధవారం మధ్యాహ్నం స్కూల్‌లో భోజనం చేసిన విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. భోజనం తిన్న తర్వాత దాదాపు 110 మంది తీవ్ర ఇబ్బందిపడటంతో స్కూల్ సిబ్బంది వెంటనే స్పందించింది. ఓ ప్రభుత్వ డాక్టర్‌ను స్కూల్‌కు పిలిపించింది. అందులో 15 మంది విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉండటంతో ఫస్ట్ ఎయిడ్ చేశారు. అందులో తొమ్మిది మందిని మెరుగైన చికిత్స కోసం మక్తల్ ప్రభుత్వ ఏరియా హాస్పిటల్‌కు తరలించారు.
Also Read: అక్కినేని అఖిల్ ఎంగేజ్మెంట్ .. ప్రకటించిన నాగార్జున
అందులో ముగ్గురు విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని మహబూబ్‌నగర్ ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించారు. అయితే వారి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ తరుణంలోనే మళ్లీ ఇలా జరగడంతో పలువురు మండిపడుతున్నారు.