Fire Accident: రంగారెడ్డి జిల్లాలో ఘోర ఆగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. శనివారం తెల్లవారుజామున నార్సింగి పీఎస్ పరిధిలోని పుప్పాలగూడలో గోల్డెన్ ఒరియా అపార్ట్‌మెంట్‌లోని మూడో అంతస్తులో ఓ ఫోర్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు చూసి భయాదోళనకు గురైన స్థానికులు బయటకు పరుగులు తీశారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు.
తప్పిన ప్రమాదం..
ఉదయం 3 గంటల సమయంలో మంచి నిద్రలో ఉండగా ఒక్కసారిగా మంట చెలరేగడంతో అందరూ భయ పడ్డారు. ఘటనకు సంబంధించి పోలీసులు, ఫైర్ సిబ్బంది సమయానికి స్పందించి మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి హాని జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. షార్ట్ సర్క్యూట్‌తో ప్రమాదం జరిగిందని అపార్ట్‌మెంట్ వాసులు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి: వాతావరణంలో మార్పులతో డెంగ్యూ వస్తుందా?
షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. దట్టమైన పొగ కమ్ముకోవడంతో అపార్ట్‌మెంట్ వాసులు భయ పడ్డారు. దట్టమైన పొగ కమ్మేయడంతో ఆ ప్రాంత ప్రజలు కొద్దిసేపు ఊపిరి తీసుకోలేక ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ఆస్తి నష్టం సంభవించ లేదు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో.. అగ్నిమాపక సిబ్బంది మంటల్ని అదుపు చేయటంతో కాలనీ వాసులు సంతోషం వ్యక్తం చేశారు. ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: ఈ వ్యాధులు ఉన్నవారు నెయ్యి ముట్టుకోవద్దు