BIG BREAKING: హైదరాబాద్‌లో హైటెన్షన్.. ఒకే రోజు మూడు భారీ అగ్ని ప్రమాదాలు.. ఎక్కడెక్కడంటే?

మేడ్చల్‌ జిల్లా గుండ్ల పోచంపల్లిలోని అపీరియల్ ఎక్స్‌పోర్ట్‌ పార్క్‌లోని కెమికల్ గోడౌన్‌లో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదం సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకున్నారు. భారీగా ఎగిసిపడుతున్న మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. 

New Update
 fire accident  ambarpet

Fire Accident Madchal

Fire Accident Hyderabad:  హైదరాబాద్‌లో వరుస ఆగ్ని ప్రమాదాలు నగర వాసులను  భయభ్రాంతులకు గురిచేస్తున్నారు.  సోమవారం భాగ్యనగరంలో మూడు వేర్వేరు ప్రాంతాల్లో అగ్ని ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. నార్సింగి, కుత్భుల్లాపూర్‌ పీఎస్‌ పరిధి, మేడ్చల్‌ జిల్లాలో అగ్నిప్రమాదం కలకలం రేపాయి. భారీ మంటలకు పుప్పాలగూడలో ఫర్నీచర్   గోదాంలో ఫర్నీచర్ తగలబడింది. భారీగా మంటలు ఎగసిపడటంతో నార్సింగి ప్రజలు ఆందోళనకు గురయ్యారు. ప్రమాదం జరగటంతో గోదాంలో ఉన్న సిబ్బంది భయంతో బయటకు పరుగులు తీశారు. 

వరుస ప్రమాదాలు:

ప్రమాదంపై సమాచారం అందుకున్న నార్సింగి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.  అనంతరం అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. దీంతో హుటాహటిన ఫైర్‌ సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలు ఆర్పారు. భారీగా ఎగసిపడుతున్న మంటలు, పొగ వల్ల చుట్టు పక్కన స్థానికులు ఆందోళనకు గురయ్యారు. ఈ ప్రమాదంలో మంటలు వెంటనే పక్కనే ఉన్న అపార్ట్‌మెంట్‌లోకి అంటుకున్నాయి. దీంతో అపార్ట్‌మెంట్ వాసులు ఆందోళనకు గరై భయంతో బయటకు పరుగులు పెట్టారు. ఫైర్‌  సిబ్బంది మంటలను అదుపు చేయటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

ఇది కూడా చదవండి: మహా శివరాత్రి అసలు ఎందుకు జరుపుకుంటారు?

కుత్భుల్లాపూర్‌ పెట్ బషీరాబాద్ పీఎస్‌ పరిధి మైసమ్మగూడలోని ఓ స్క్రాప్ గోడౌన్‌లో మరో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. గోడౌన్‌లో ఉన్న వస్తువులకు మంటలు అంటుకోవటంతో..  గోడౌన్ మొత్తం మంటలు వ్యాపించాయి. మంటలు భారీగా అంటుకోవడంతో స్థానికులు అగ్ని మాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఫైర్‌ సిబ్బంది రెండు ఫైరింజన్లతో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అనంతరం మంటలను అదుపులో తెచ్చారు. అయితే ఈ ప్రమాదంలో ఆస్తి నష్టం భారీగా సంభవించిందని అధికారులు అంచనా వేశారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. 

ఇది కూడా చదవండి: అతిగా వ్యాయామం చేయడం వల్ల కలిగే అనర్థాలు

మేడ్చల్‌ జిల్లాలో మరో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. గుండ్ల పోచంపల్లిలోని అపీరియల్ ఎక్స్‌పోర్ట్‌ పార్క్‌లోని కెమికల్ గోడౌన్‌లో ఒక్కసారిగా మంటలు చేలరేగాయి. ప్రమాదం సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకున్నారు. భారీగా ఎగిసిపడుతున్న మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.   

ఇది కూడా చదవండి: కలబందలోని ఐదు అద్భుతమైన ప్రయోజనాలు

Advertisment
తాజా కథనాలు