/rtv/media/media_files/2025/03/04/nM3jNjM9NVbDY2BGnlaK.jpg)
Fire Accident Ambarpet
Fire Accident: హైదరాబాద్‌లోని పెద్ద అంబర్‌పేట్‌లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కొత్తగా కట్టిన అంబర్‌పేట్ కొత్త ఫ్లై ఓవర్‌ను దట్టమైన పొగ కమ్మేసింది. వాహనదారులు, స్థానికులు దట్టమైన పొగతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఫైఓవర్ కింద గోడౌన్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటల దాటికి గోడౌన్‌లోని సామాగ్రి పూర్తిగా దగ్ధమైంది.
అంబర్ పేట చే నెంబర్ చౌరస్తాలో అగ్ని ప్రమాదం..
— RTV (@RTVnewsnetwork) March 4, 2025
ఫ్లైఓవర్ కి సంబంధించిన ఐరన్ రాడ్లు బిల్డింగ్ చేస్తుండగా ప్రమాదం
భారీగా ఎగిసి పడుతున్న మంటలు
భయభ్రాంతులకు గురవుతున్న స్థానిక ప్రజలు#Amberpet#FireIncident#Hyderabad#RTVpic.twitter.com/q3pVs3RAGk
ఇది కూడా చదవండి: ఈ విత్తనాలను తింటే చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించుకోవచ్చు
ప్రమాదంపై సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకున్నారు. అనంతరం ఫైర్ ఇంజన్లతో మంటలార్పే ప్రయత్నం చేస్తున్నారు అగ్ని మాపక సిబ్బంది. ప్రమాదంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇది కూడా చదవండి: తిరుమలలో మళ్లీ కనిపించిన చిరుత.. భక్తులకు TTD కీలక సూచనలు!