BIG BREAKING: తెలంగాణలో 10వేల ఉద్యోగాలు

గ్రామాల్లో రెవెన్యూ వ్యవహారాలను చూసుకోడానికి తెలంగాణ ప్రభుత్వం 10,954 గ్రామ పాలన ఆఫీసర్లను నియమించనున్న విషయం తెలిసిందే. అయితే ఆయా పోస్టులకు శనివారం రాష్ట్ర ఆర్థిక శాఖ క్లియరెన్స్ ఇచ్చింది. త్వరలో ప్రభుత్వం GPO ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయనుంది.

New Update
tg jobs

tg jobs Photograph: (tg jobs)

రాష్ట్రంలో కొలువుల జాతర నడుస్తోంది. తెలంగాణ గ్రూప్ 2, గ్రూప్ 3 ఫలితాలు కొన్ని రోజుల క్రితమే వచ్చాయి. మహిళా శిశు సంక్షేమ శాఖలో 13వే ఉద్యోగాల నోటిఫికేషన్ సిద్ధంగా ఉంది. వాటితోపాటు మరో నోటిఫికేషన్ విడుదలకు సిద్ధంగా ఉంది. అదే గ్రామ పాలన అధికారులు. గ్రామాల్లో రెవెన్యూ వ్యవహారాలను చూసుకోడానికి తెలంగాణ ప్రభుత్వం 10,954 గ్రామ పాలన ఆఫీసర్లను నియమించనున్న విషయం తెలిసిందే. అయితే ఆయా పోస్టులకు శనివారం రాష్ట్ర ఆర్థిక శాఖ క్లియరెన్స్ ఇచ్చింది. నూతన గ్రామ రెవెన్యూ అధికారుల వ్యవస్థకు జిపిఓ గా పేరు పెట్టారు. ఈ మేరకు ఆర్థిక శాక ప్రిన్సిపల్ సెక్రెటరీ ఉత్తర్వులు జారీ చేశారు.

వీఆర్ఓ, వీఆర్ఏ వలే వీరు విలేజ్ అడ్మినిస్ట్రేషన్ చూసుకోనున్నారు. ఈమేరకు రాష్ట్ర మంత్రివర్గం కొత్తగా 10వేల 950 విలేజ్ లెవెల్ ఆఫీసర్ పోస్టులకు తెలంగాణ కేబినెట్ గతంలోనే ఆమోదం తెలిపింది. కొత్తరెవెన్యూ డివిజన్లు, కొత్త మండలాలకు 217 పోస్టులు మంజూరు చేసింది మంత్రి వర్గం. పరీక్షలు నిర్వహించి 10వేల మందిని నియమించి గ్రామ పాలన కొనసాగించాలని ప్రభుత్వ ఆలోచన.

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు