నేడు ఎర్రవెల్లిలో KCR కీలక సమావేశం

TG: ఈరోజు ఎర్రవెల్లి ఫామ్ హౌస్‌లో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పాటు కొందరు ముఖ్య నేతలతో కేసీఆర్ సమావేశం కానున్నారు. ఈ నెల 9 నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై కేసీఆర్ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు.

New Update
BRS KCR

KCR: ఈరోజు మాజీ సీఎం కేసీఆర్ అధ్యక్షతన బీఆర్‌ఎస్‌ శాసనసభా పక్ష సమావేశం జరగనుంది. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో జరిగే ఈ సమావేశానికి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పాటు కొందరు ముఖ్య నేతలు కూడా హాజరుకానున్నారు. కాగా ఈ నెల 9 నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై కేసీఆర్ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. కాంగ్రెస్‌ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు, ఏడాదిలో రేవంత్‌ ప్రభుత్వ పాలన వైఫల్యాలతో పాటు ప్రజా సమస్యలను ప్రస్తావించాలని బీఆర్‌ఎస్‌ భావిస్తోంది. దాదాపు వారం రోజుల పాటు ఈ సారి అసెంబ్లీ సమావేశాలు జరగనున్నట్లు తెలుస్తోంది.   మరి ఈ సమావేశాలకు ప్రతిపక్ష నేతగా కేసీఆర్ హాజరవుతారా? లేదా ఎప్పటిలాగే డుమ్మా కొడతారా? అనే చర్చ రాష్ట్ర రాజకీయాల్లో జరుగుతోంది.

ఇది కూడా చదవండి: రేషన్ మాఫియాలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే.. క్లారిటీ!

కాంగ్రెస్ ను ఇరుకున పెట్టె ప్లాన్.!

ఈ అసెంబ్లీ సమావేశాల్లో అధికార కాంగ్రెస్ పార్టీని ఇరుకున పెట్టె ఆలోచనలో బీఆర్ఎస్ ఉంది. ఇందుకోసం వ్యూహాలు రచిస్తోంది. కాంగ్రెస్ ఏడాది పాలనపై, తీసుకున్న నిర్ణయాలు, అమలు కానీ హామీలు, హైడ్రా, మూసీ ప్రక్షాళన, రైతు భరోసా, లగచర్ల ఘటన వంటి అంశాలను అసెంబ్లీలో ప్రస్తావిస్తూ ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించాలని బీఆర్ఎస్ నేతలు ఉవ్విళ్లూరు తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే కేసీఆర్.. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కీలక సమావేశం నిర్వహించినట్లు సమాచారం. కాగా ప్రధాన ప్రతిపక్ష నేత హోదాలో అసెంబ్లీ సమావేశాలు వస్తారా? లేదా? అనేది మరికొన్ని గంటల్లో తేలనుంది. అయితే కేసీఆర్ ఈ సమావేశాలకు తప్పకుండ హాజరవుతారని బీఆర్ఎస్ పార్టీ వర్గాలు చెప్పాయి.

ఇది కూడా చదవండి: BREAKING: బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కారు, ఫోన్ సీజ్!

నిన్న కేసీఆర్ కు ఆహ్వానం...

ప్రజాపాలన విజయోత్సవ వేడుకలకు రావాలంటూ కేసీఆర్ ను ఆహ్వానించారు మంత్రి పొన్నం ప్రభాకర్. నిన్న మధ్యాహ్నం ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కు వెళ్లి మర్యాద పూర్వకంగా ఆహ్వానం పలికారు. ఇందుకు కేసీఆర్ సైతం  సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. మంత్రి పొన్నం తో పాటు ప్రభుత్వ ప్రోటోకాల్ ప్రజా సంబంధాల సలహాదారు వేణుగోపాల్, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, ప్రోటోకాల్ అధికారి వెంకట్ రావు ,హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురశెట్టి వెళ్లారు. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు