దసరా దావత్.. రూ.100కే గొర్రెపొట్టేలు, మేకపోతు, ఫుల్ బాటిల్స్!

ఈ దసరాను విసూత్నంగా జరుపుకునేందుకు మంచిర్యాల జిల్లా బోయపల్లి గ్రామస్థులు బంపర్ ఆఫర్ ప్రకటించారు. రూ.100కు కూపన్ కొని లక్కీడ్రాలో గొర్రె పొట్టేలు, మేకపోతు, నాటుకోడి, ఫుల్ బాటిల్ గెలుచుకోవాలంటూ పోస్టర్ రిలీజ్ చేశారు. అక్టోబర్ 10న డ్రా తీయనున్నారు.

author-image
By srinivas
der
New Update

Dussehra Bumper Offer : తెలంగాణలో దసరా పండుగ అంటేనే మందు, మాంసం జోరు దావత్‌ల హంగామా. ఆ రోజు ముక్క, చుక్క లేనిదే ముద్ద దిగదు. ప్రతి గ్రామంలోనూ భారీ సంఖ్యలో మేకలు, గొర్రెలు, నాటుకోళ్లను కోస్తారు. అయితే ఈ యేడాది మంచిర్యాల జిల్లాలోని ఓ గ్రామస్థులు వినూత్నంగా ఆలోచించి వార్తల్లో నిలిచారు. కేవలం 100 రూపాయలకే పొట్టేలు, మేకపోతు, నాటుకోడిపుంజు, ఫుల్ బాటిల్ ఇవ్వబోతున్నట్లు బంపర్ ఆఫర్ ప్రకటన విడుదల చేశారు. 

జానీ వాకర్, టీచర్స్ ఫుల్ బాటిల్..

ఈ మేరకు బోయపల్లి గ్రామస్థులు దసరా పండగను విసూత్నంగా జరుపుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగానే ఆ ఊరి ప్రజలు రూ.100 కూపన్ కొనుగోలుచేసి లక్కీ డ్రాలో తను అదృష్టాన్ని పరీక్షించుకోవాలంటూ పోస్ట్ ర్ రిలీజ్ చేశారు. అక్టోబర్ 10న డ్రా తీసి విజేతలకు ప్రకటిస్తామన్నారు. మొదటి బహుమతి - గొర్రెపొట్టేలు, రెండో బహుమతి - మేకపోతు, మూడో బహుమతి- జానీవాకర్ ఫుల్ బాటిల్, నాలుగో బహుమతి - టీచర్స్ ఫుల్ బాటిల్, ఐదో బహుమతి - బ్లాక్ డాగ్ ఫుల్ బాటిల్, ఆరో కానుక-100 ఫైవర్స్ ఫుల్ బాటిల్, ఏడు, ఎనిమిది బహుమతులు- నాటుకోడి పుంజు, తొమ్మిది, పదో బహుమతిగా - నాటుకోడి పెట్టను ఇవ్వనున్నట్లు తెలిపారు. 

ఈ ప్రకటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. జనం భారీ సంఖ్యలో కూపన్స్ కొంటున్నారు. ప్రకటన విడుదల చేసిన రెండు రోజుల్లోనే 50 శాతం కూపన్స్ అమ్ముడు పోయినట్లు నిర్వాహకులు తెలిపారు. 

Also Read :  'Devara' సాంగ్ ను తెలుగులో అద్భుతంగా పాడిన ఆలియా భట్.. వీడియో వైరల్

#mancherial #dussehra
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి