స్నానానికి వెళ్లిన డాక్టర్లు.. ఈత కొడుతూ చివరకు

జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలో విషాదం జరిగింది. SRSP కాలువలో స్నానానికి వెళ్లి డాక్టర్ గల్లంతు అయ్యాడు. విట్టంపేట్‌ గ్రామ శివారులోని వరద కాలువలోకి ముగ్గురు డాక్టర్లు స్నానానికి వెళ్లారు. వరద ఎక్కువగా రావడంతో ఉదయ్‌ కుమార్ అనే డాక్టర్ గల్లంతు అయ్యాడు.

doctor
New Update

జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలో విషాదం జరిగింది. SRSP కాలువలో స్నానానికి వెళ్లి డాక్టర్ గల్లంతు అయ్యారు. విట్టంపేట్‌ గ్రామ శివారులోని వరద కాలువలోకి డాక్టర్లు స్నానానికి వెళ్లారు. వరద ఎక్కువగా రావడంతో ఉదయ్‌ కుమార్ అనే డాక్టర్ గల్లంతు అయ్యారు. డాక్టర్ ఉదయ్ స్వస్థలం హన్మకొండ అని తెలుస్తోంది. అతడు మెట్‌పల్లి యశోద హాస్పిటల్‌లో డాక్టర్‌గా పని చేస్తున్నాడు. పూర్తి వివరాల్లోకి వెళితే..

ఇది కూడా చదవండి: Iran సుప్రీం లీడర్ ఆరోగ్య పరిస్థితి విషమం.. తర్వాతి వారసుడు ఆయనేనా

పట్టణంలోని శ్రీ సాయి లక్ష్మీ నివాస్ ఆసుపత్రిలో పనిచేస్తున్న డాక్టర్ అశోక్ రెడ్డి, యశోద హాస్పిటల్‌లో పనిచేస్తున్న డాక్టర్ ఉదయ్ కిరణ్ రెడ్డి, రాయికల్ పట్టణంలోని యశోద ఆసుపత్రిలో పనిచేస్తున్న ప్రశాంత్ కుమార్, అలాగే సాయి లక్ష్మీ నివాస్ ఆసుపత్రి యజమాని ఆత్మకూరి రాజు, లింగాల లిఖిత్ రెడ్డి కలిసి మెట్‌పల్లిలోని మెట్ల చిట్టాపూర్ గ్రామానికి వెళ్లారు.

ఇది కూడా చదవండి: పేలని మంత్రి పొంగులేటి పొలిటికల్ బాంబు.. కారణం అదేనా? 

ఈత కొడుతూ గల్లంతయిన డాక్టర్

ఆ తర్వాత అక్కడున్న కాలువలో స్నానం చేసేందుకు వారంతా కలిసి వెళ్లారు. ఆ సమయంలో డాక్టర్ ప్రశాంత్ కుమార్, డాక్టర్ ఉదయ్ కిరణ్ రెడ్డి ఇద్దరూ నీటిలోకి వెళ్లి ఈత కొట్టారు. అయితే డాక్టర్ ఉదయ్ కిరణ్ రెడ్డి ఒక్కసారిగా నీటిలో మునిగిపోయాడు. దీంతో మిగతా వారు అది గమనించి ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేశారు. వెంటనే వారు సంఘటన స్థలానికి చేరుకున్నారు.

ఇది కూడా చదవండి: మహిళలకు గుడ్‌న్యూస్.. త్వరలోనే బస్సు యజమానులుగా.. భట్టీ కీలక వ్యాఖ్యలు

ఈ మేరకు డాక్టర్ ఉదయ్ రెడ్డి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కాగా మునిగిపోయిన డాక్టర్ ఉదయ్ కిరణ్ రెడ్డిది హనుమకొండ జిల్లాగా తెలిపారు. మిగతా వారిది భద్రాద్రి కొత్తగూడెం, మహబూబ్నగర్ జిల్లాలకు చెందినవారుగా చెప్పారు. 

ఇది కూడా చదవండి: పేలని మంత్రి పొంగులేటి పొలిటికల్ బాంబు.. కారణం అదేనా? 

#metpally #crime-telangana
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe