నిర్మల్ జిల్లాలో హైటెన్షన్..ఆర్డీవోను 5గంటలు నిర్భంధించిన గ్రామస్థులు!

నిర్మల్ జిల్లా దిలావర్‌పూర్‌లో హైటెన్షన్‌ వాతావరణం చేటుచేసుకుంది. ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటుపై నిర్మల్ జిల్లా దిలావర్​పూర్ గ్రామస్థులు తమ పోరాటాన్ని ఉధృతం చేశారు. దీంతో అక్కడికి చేరుకున్న ఆర్డీవో రత్నకల్యాణిని కారులోనే దాదాపు 5 గంటలుగా నిర్బంధించారు.

New Update
Nirmal District Ethnol Factory

నిర్మల్ జిల్లా దిలావర్‌పూర్‌లో హైటెన్షన్‌ వాతావరణం చేటుచేసుకుంది. ఆర్డీవో రత్నకల్యాణిని దిలావర్‌పూర్ గ్రామస్తులు కారులోనే దాదాపు 5 గంటలుగా నిర్బంధించారు. ఇందులో భాగంగా మండల కేంద్రంలో నిర్మిస్తున్న ఇథనాల్ ఫ్యాక్టరీ రద్దు చేయాలని దిలావర్​పూర్ గ్రామస్థులు తమ పోరాటం ఉధృతం చేశారు. ఈ మేరకు గ్రామస్తులు హైవేపై మెరుపు దర్నాకు దిగారు. సుమారు 11 గంటలుగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలోని ఇళ్లకి, స్కూళ్లకు తాళాలు వేసి మరీ రాస్తారోకో చేపట్టారు. చిన్నా, పెద్దా అంతా కలిసి ర్యాలీగా రోడ్డెక్కారు. గ్రామస్తుల మెరుపు ధర్నాతో రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో దిలావర్పూర్‌లో 500 మంది పోలీసులు భారీగా మోహరించారు.

Also Read: అక్కినేని అఖిల్ ఎంగేజ్మెంట్ .. ప్రకటించిన నాగార్జున

గత కొన్ని రోజులుగా ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా దిలావర్‌పూర్, గుండం పల్లి గ్రామ ప్రజలు ఆందోళన చేస్తున్నారు. అయితే అధికారులు ఎవ్వరూ పట్టించుకోవడం లేదంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి, మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, డీసీపీ అధ్యక్షుడు శ్రీహరిరావులు కనబడటం లేదంటూ రోడ్లపై ప్లకార్డులు ప్రదర్శించారు.

Also Read: RGVకి షాకిచ్చిన ఏపీ హైకోర్టు..

గ్రామాల సమీపంలో ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మించొద్దని.. వేరే చోట ఏర్పాటు చేసుకోవాలని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వం ఇప్పటికే ఇథనాల్ ఫ్యాక్టరీకి పూర్తి స్థాయిలో అనుమతులు ఇచ్చిన నేపథ్యంలో ఇప్పుడు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఆయా గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Also Read: ఐపీఎల్ వేలంలో అన్‌సోల్డ్‌గా మిగిలిన స్టార్ ఆటగాళ్లు

లగచర్ల ఘటన మాదిరిగానే

ఇదిలా ఉంటే.. ఇటీవల ఇలాంటి ఘటనే సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గం కొడంగల్‌లో జరిగింది. లగచర్ల ఫార్మా పరిశ్రమల ఏర్పాటను వ్యతిరేకిస్తూ స్థానికులు నిరసనలు చేపట్టారు. ఇందులో భాగంగానే ప్రజలు నిరసనలు వ్యక్తం చేశారు.

Also Read: ఊహించని రేంజ్‌లో ఐపీఎల్ బిజినెస్.. మూడు రెట్లు పెరిగిన పెట్టుబడి!

సర్వే కోసం వచ్చిన అధికారులపై కొందరు దాడి చేశారు. ఏకంగా కలెక్టర్ పైనే దాడి చేయడంతో ఈ ఘటన యావత్ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ దాడికి కారకులైన పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. 

. . . . . . 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు