/rtv/media/media_files/2025/01/23/um72xhSronb8KNmdalW4.webp)
Differences in Patancheru Congress
Congress: పటాన్ చెరు కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే మహిపాల్ వర్సెస్ కాంగ్రెస్ సీనియర్లుగా విడిపోయి వీధులకెక్కారు.ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి వ్యతిరేకంగా రోడ్డెక్కిన కాంగ్రెస్ సీనియర్లు మహిపాల్ రెడ్డిని పార్టీ నుండి సస్పెండ్ చెయ్యాలని డిమాండ్ చేశారు.సేవ్ కాంగ్రెస్..సేవ్ పఠాన్ చెరు నినాదంతో రోడ్డెక్కిన నాయకులు ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటం పెట్టేందుకు కార్యాలయం వైపు కాంగ్రెస్ శ్రేణులు దూసుకెళ్లాయి. పోలీసులు అడ్డుకోవడంతో కాంగ్రెస్ నాయకులు మధ్య తోపులాట జరిగింది.
Also Read: స్వలింగ వివాహాలకు అధికారిక గుర్తింపు ...ఆగ్నేసియాలో మొదటి దేశంగా థాయిలాండ్!
ఒకవైపు ఆందోళనలు కొనసాగుతున్న సమయంలోనే అమీన్‌పూర్‌లో పోలీసుల బందోబస్తు మధ్య అభివృద్ధి కార్యక్రమాల్లో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి పాల్గొన్నారు. పటాన్‌చెరు ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా ధర్నాకు దిగారు కాట శ్రీనివాస్ గౌడ్ అనుచరులు. పటాన్‌చెరు బస్టాండ్ వద్ద జాతీయ రహదారి 65పై భారీగా చేరుకున్న కాంగ్రెస్ శ్రేణులు ధర్నాకు దిగారు. ఎమ్మెల్యే ఏ పార్టీలో ఉన్నాడో చెప్పాలని డిమాండ్ చేశారు. పార్టీలో తనతో పాటు చేరిన బీఆర్‌ఎస్ నాయకులకే ప్రాధాన్యత ఇస్తున్నాడని వారు ఆరోపించారు. అనేక సంవత్సరాలుగా పార్టీని నమ్ముకున్నవారికి అన్యాయం చేస్తున్నాడన్నారు. సీనియర్ కాంగ్రెస్ నాయకులకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని కాంగ్రెస్ నాయకుల ఆరోపించారు. అలాగే ప్రోటోకాల్ విషయంలోనూ వివాదాలు ఉన్నాయని ఒకరి ఫోటో ఉంటే మరొకరిది ఉండడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అలాగే సీనియర్ కాంగ్రెస్ నాయకులపై ఎమ్మెల్యే అనుచరులు దాడులు చేస్తున్నారని వాపోయారు. ఇటీవల బొల్లారంలో పాత కాంగ్రెస్ నాయకులపై ఎమ్మెల్యే దుర్బాషలాడిన ఘటనను వారు తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఎమ్మెల్యే తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న కాంగ్రెస్ కేడర్ ఆయనను పార్టీనుంచి బహిష్కరించాలని డిమాండ్ చేశారు.
Also Read : ఈసారి కప్ నమ్‌దే.. గంగాస్నానం చేసిన ఆర్సీబీ జెర్సీ
కాగా గత కొంతకాలంగా పటాన్‌చెరులో కాంగ్రెస్ పార్టీ మూడు ముక్కలుగా చీలిపోయింది. మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన కాట శ్రీనివాస్ గౌడ్, మెదక్ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన నీలం మధు, బీఆర్‌ఎస్‌లో గెలిచి కాంగ్రెస్‌లో చేరిన ప్రస్తుత ఎమ్మెల్యే మధ్య వివాదాలు ముదిరాయి. కాగా గతంలో తమపై కేసులు పెట్టినవారిని ఎమ్మెల్యే ప్రోత్సహిస్తున్నాడని, పోలీసులకు సైతం పోస్టింగులు ఇప్పిస్తున్నాడని నాయకులు ఆరోపిస్తున్నారు. కాగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి చిత్రపటం పెట్టకపోవడాన్ని నిరసిస్తూ పోటోతో ఆందోళన చేశారు. కాగా కాంగ్రెస్ శ్రేణుల ఆందోళనతో భారీగా పోలీసులు మొహరించారు. డీఎస్పీ, ఆరుగురు సీఐలతో సహా భారీగా పోలీసులు ఆందోళన కారులను అడ్డుకున్నారు.