/rtv/media/media_files/2025/10/20/danam-2025-10-20-13-45-36.jpg)
తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యే దానం నాగేందర్ ను జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో స్టార్ కాంపెయినర్ గా నియమిస్తూ ఎన్నికల అధికారికి అఫీషియల్ నోట్ ను పంపించారు ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్. బీఆర్ఎస్ పార్టీ నుండి ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా గెలిచిన దానం నాగేందర్ అనంతరం పార్టీ ఫిరాయించి, కాంగ్రెస్ పార్టీలో చేరారు. అంతేకాకుండా కాంగ్రెస్ బీ-ఫామ్ పై సికింద్రాబాద్ ఎంపీగా కూడా పోటీ చేశారు.
బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి మారిన 10 మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై మూడు నెలల్లోగా అంటే అక్టోబర్ 31లోగా నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌ను ఆదేశించింది. ఈ గడువును సుప్రీంకోర్టు జులై 2025లో విధించింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు, అసెంబ్లీ స్పీకర్ ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులకు వివరణ ఇవ్వాలని అందులో పేర్కొన్నారు. అయితే స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు ఇప్పటివరకు దానం ఎలాంటి వివరణ ఇవ్వలేదు.
ఫిరాయింపు ఎమ్మెల్యే దానం నాగేందర్ ఏఐసీసీ స్టార్ కాంపెయినర్ బన్ గయా.!
— Telugu Reporter (@TeluguReporter_) October 20, 2025
పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యే దానం నాగేందర్ ను జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో స్టార్ కాంపెయినర్ గా నియమిస్తూ ఎన్నికల అధికారికి అఫీషియల్ నోట్ ను పంపిన ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్..
బీఆర్ఎస్ పార్టీ నుండి… pic.twitter.com/L1rxH4zCcl
ఢిల్లీలో ఉన్న ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ కు కూడా దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీ లో ఉన్నాడని తెలుసు కానీ.. హైదరాబాద్ లో ఉన్న స్పీకర్ కు మాత్రం ఇంకా అర్థం కాకపోవడం దారుణమని సోషల్ మీడియాలో బీఆర్ఎస్ కార్యకర్తలు విమర్శలు గుప్పిస్తున్నారు. మరోవైపు ఎమ్మెల్యే పదవికి దానం నాగేందర్ చేత రాజీనామా చేయించి మళ్లీ పోటీ చేయించాలనే ఆలోచనలో కాంగ్రెస్ ఉన్నట్లుగా తెలుస్తోంది. అన్హరత వేటు వేయడం కంటే.. ఆయనతో రాజీనామా చేయించడమే బెటర్ అనే చర్చ కాంగ్రెస్ వర్గాల్లో ఉంది.
ఉప ఎన్నికలు తప్పవు
స్పీకర్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసినా, లేదా కొందరు రాజీనామా చేసినా ఆయా నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు తప్పవు. ప్రస్తుతం ఫిరాయింపు ఎమ్మెల్యేల భవితవ్యం స్పీకర్ చేతుల్లో ఉంది. సుప్రీంకోర్టు విధించిన అక్టోబర్ 31 డెడ్‌లైన్ దగ్గర పడుతుండటంతో, స్పీకర్ ఏ విధంగా నిర్ణయం తీసుకుంటారు, ఆ నిర్ణయం రాష్ట్ర రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందనేది త్వరలో తేలనుంది.
Follow Us