/rtv/media/media_files/2025/10/08/ponnam-prabhakar-vs-adluri-laxman-2025-10-08-11-47-15.jpg)
ponnam prabhakar vs adluri laxman
Ponnam vs Adluri : మంత్రి అడ్లూరి లక్ష్మన్‌కుమార్‌ను ఉద్దేశించి మరో మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలు దుమారం లేపాయి. ఆయనను దున్నపోతు అని సంభాషించడం వివాదానికి దారి తీసింది. తను మాదిగ అయినందునే తనను తక్కువ చేస్తున్నారని అడ్లూరి అసహానం వ్యక్తం చేశారు. తనను అలా అంటున్న సమయంలో పక్కనే ఉన్న వివేక్ మాట్లాడక పోవడాన్ని లక్ష్మన్ తీవ్రంగా పరిగణించారు. అంతేకాక వివేక్ పై కూడా ఆయన పలు ఆరోపణలు చేశారు. తనకు మంత్రి పదవి రావడం వివేక్‌కు ఇష్టం లేదని, తనను అవమానపరిచేలా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. ఈ విషయమై అధిష్టానికి ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. కాగా అడ్లూరి లక్ష్మన్ ను అవమాన పరిచారని ఆరోపిస్తూ దళిత సంఘాలు పొన్నం ఇంటి ముట్టడికి పిలుపునిచ్చాయి.
మంత్రి పొన్నం ఇంటి వద్ద భారీ భద్రత
మంత్రి అడ్లూరి పై మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యలకు నిరసనగా దళిత సంఘాలు పొన్నం ఇంటి ముట్టడికి పిలుపునిచ్చాయి. దీంతో ప్రభాకర్ ఇంటి వద్ద భద్రత పెంచారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ పై పొన్నం ప్రభాకర్ అనుచిత వ్యాఖ్యల పై దళిత సంఘాల ఆగ్రహం వ్యక్తం చేశాయి. అడ్లూరి కి క్షమాపణ చెప్పకపోతే.. పొన్నం ఇంటిని ముట్టడిస్టామని దళిత సంఘాలు హెచ్చరించాయి. పొన్నం ఇంటి ముట్టడి పిలుపు నేపథ్యంలో పోలీసులు భద్రతను పెంచారు.పొన్నం ఇంటి ముందు బారికేడ్స్ ఏర్పాటు చేశారు.
అడ్లూరి నా సోదరుడు : పొన్నం
మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పై అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో పొన్నం ప్రభాకర్ వివరణ ఇచ్చారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు నాకు సోదరులవంటివారు. కాంగ్రెస్ పార్టీలో మాకు 30 సంవత్సరాలుగా ఉన్న స్నేహబంధం రాజకీయాలకు మించినదే. మా ఇద్దరి మధ్య ఉన్న అనుబంధం, పరస్పర గౌరవం ఎప్పుడూ అలాగే కొనసాగింది. ఎవరు విడదీయరానిది అని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. నేను ఆయనపై ఎటువంటి వ్యక్తిగత వ్యాఖ్యలు చేయలేదు. అట్టడుగు స్థాయి నుంచి వచ్చిన వ్యక్తిగా, బీసీ వర్గానికి చెందిన నాయకుడిగా, నాకు ఎవరిపైనా అలాంటి అభిప్రాయం ఉండదు. అయితే, రాజకీయ దురుద్దేశంతో కొంతమంది నా వ్యాఖ్యలను వక్రీకరించి, వాస్తవానికి భిన్నంగా ప్రచారం చేశారు. దాంతో ఏర్పడిన అపార్థాల వల్ల అన్నలాంటివారు అయిన అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారి మనసు నొచ్చుకుందని తెలిసి నేను తీవ్రంగా విచారిస్తున్నాను.అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు మనసు నొచ్చుకొని ఉంటే చింతిస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను బలోపేతం చేయడంలో,రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో సామాజిక న్యాయం సాధనలో, ప్రజల అభ్యున్నతికై మేము ఇద్దరం కలిసికట్టుగా కృషి చేస్తాం అని ఆయన వివరణ ఇచ్చారు.
కాంగ్రెస్ హైకమాండ్ సీరియస్
మంత్రుల వివాదంపై కాంగ్రెస్ హైకమాండ్ సీరియస్ అయింది. వివాదానికి పుల్‌స్టాప్ పెట్టేందుకు పీసీసీ ప్రెసిడెంట్‌ను రంగంలోకి దింపింది. పొన్నం, అడ్లూరికి టీపీసీసీ చీఫ్ మహేష్ తన వద్దకు రావాలని పిలుపునిచ్చారు. దీంతో వారిద్దరూ మహేష్‌గౌడ్ నివాసానికి చేరుకున్నారు. అయితే అంతకు ముందే పొన్నం ప్రభాకర్ ప్రకటన చేశారు. అయితే ఆ ప్రకటనపై సంతృప్తి చెందని అడ్లూరి లక్ష్మణ్ పొన్నం తనకి క్షమాపణ చెప్పాల్సిందేనని పట్టుబడుతున్నారు. మంత్రి అడ్లూరితో వివాదంపై మంత్రి పొన్నం విచారం వ్యక్తం చేశారు. అయితే చింతిస్తున్నా అనడం కంటే.. పొరపాటు జరిగింది అంటే బాగుండేది - అడ్లూరి లక్ష్మణ్ అభిప్రాయపడ్డారు. ఆయన మాట్లాడిన మాటలు రాష్ట్రమంతా చూసిందన్న లక్ష్మణ్ నేను , పొన్నం 20 ఏళ్లుగా మంచి స్నేహతులం- అన్నారు. ఆయన
వెంటనే క్షమాపణలు చెప్తే బాగుండేది -అని అన్నారు.
Also Read: Nani Heroine: నానికి కలిసొచ్చిన హీరోయిన్.. ఈసారి 'జూలియట్' గా మళ్ళీ రొమాన్స్!