/rtv/media/media_files/2025/02/08/MHBNMohK7rkydU8vyJ21.jpg)
counting
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. ఫిబ్రవరి 11న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లకు రాష్ట్ర ఎన్నికల సంస్థ ఎన్నికలు నిర్వహించింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 136 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు అధికారులు. మధ్యాహ్నం లోగా ట్రెండ్స్‌పై క్లారిటీ రానుంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కిస్తారు. తర్వాత సాధారణ బ్యాలెట్ ఓట్ల కౌంట్ చేస్తారు. 7 మున్సిపల్ కార్పొరేషన్లు 414 వార్డులు, 116 మున్సిపాలిటీలు 2,582 వార్డులు మొత్తం 2,996 వార్డులకు అభ్యర్ధులు పోటీ పడ్డారు. బరిలో 12,944 మంది అభ్యర్థులు ఉన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో మొత్తంగా 73 శాతం పోలింగ్ నమోదైంది. మున్సిపాలిటీల్లో 75.88%, కార్పొరేషన్లలో 66.05% ఓట్లు పోల్ అయ్యాయి.
తెలంగాణలో ప్రధాన పార్టీల క్యాంప్ రాజకీయాలు వేగం.!
— Telugu Reporter (@TeluguReporter_) February 13, 2026
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ఫలితాల ముందు ప్రధాన రాజకీయ పార్టీల్లో ఊపందుకున్న క్యాంప్ రాజకీయాలు.
ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ, ఆదిలాబాద్ జిల్లాల్లో ఈ పరిణామాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. స్థానిక సంస్థల్లో ఆధిపత్యాన్ని నిలుపుకునేందుకు… pic.twitter.com/ftkE7g3eO3
అత్యధికంగా చౌటుప్పల్ మున్సిపాలిటీ 91.91 శాతం ఓట్లు పోల్ అవ్వగా.. అత్యల్పంగా నందికొండ(నాగార్జున సాగర్) మున్సిపాలిటీ 59.68 శాతం పోలింగ్ అయ్యింది. ఇక కార్పొరేషన్లలో నల్గొండలో అత్యధికంగా 77.36 శాతం పోలింగ్ కాగా.. అత్యల్పంగా నిజామాబాద్ కార్పొరేషన్‌లో 59.12% ఓటర్లే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద పోలీసులు భారీ బందోబస్త్ ఏర్పాటు చేశారు. 200 మీటర్ల వరకు ఆంక్షలు విధించారు.
Follow Us