Heavy rains : మండుతున్న ఎండలకు కూల్‌ న్యూస్‌...నాలుగు రోజులు భారీవర్షాలు

ఎర్రటి ఎండలతో ఉక్కిరిబిక్కరవుతోన్న ప్రజలకు కూలింగ్‌న్యూస్‌. రానున్న నాలుగు రోజులు రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముంది. భూఉపరితలం వేడెక్కడంతో పాటు ద్రోణి ప్రభావంతో వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ ప్రకటించింది.

New Update
ap rains

Heavy rains

Heavy rains : ఎర్రటి ఎండలతో ఉక్కిరిబిక్కరవుతోన్న ప్రజలకు కూలింగ్‌న్యూస్‌. రానున్న నాలుగు రోజులు రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముంది. భూఉపరితలం వేడెక్కడంతో పాటు ద్రోణి ప్రభావంతో వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ ప్రకటించింది.
 ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్రల మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీనికి అనుసంధానంగా ద్రోణి ప్రభావం కూడా ఉంది.

Also Read: ఈ సారి ట్రంప్‌ కొరడా ఆరోగ్య శాఖ పై..వేల సంఖ్యలో ఉద్యోగుల తొలగింపు!

అలాగే మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు ప్రాంతాల మీదుగా మరో ఆవర్తనం ఏర్పడింది. వీటి ప్రభావంతో ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు పడనున్నాయని IMD తెలిపింది. వచ్చే నాలుగు రోజుల పాటు వర్షం కురిసే అవకాశముంది. పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడనున్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వడగండ్ల వాన కురిసే అవకాశముంది. 

ఇది కూడా చూడండి: ఈ రాశివారు నేడు వివాదాలకు దూరంగా ఉంటే బెటర్‌!

 మరోవైపు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో రెండు రాష్ట్రాల్లోని పలు జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేసింది. మరికొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ ఇచ్చింది. ఇక ద్రోణి ప్రభావంతో 2 నుంచి 4 డిగ్రీల మేరకు ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేసింది. వర్షసూచన ఉన్న నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.  

Also Read: Former Union Minster Girija Vyas:దేవుడి హారతి మంటలు అంటుకుని తీవ్ర గాయాలపాలైన మాజీ కేంద్ర మంత్రి

 తెలంగాణలోని ఉమ్మడి ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, కరీంనగర్‌, మహబూబ్‌నగర్‌లలో వడగండ్ల వాన కురుస్తుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. దీంతో ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది. హైదరాబాద్‌ సహా మిగతా ప్రాంతాల్లోనూ వర్షాలు పడుతాయని.. జాగ్రత్తలు పాటించాలని సూచించింది. అటు ఏపీలో కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది వాతావరణ శాఖ. భారీ వర్షాలు, ఈదురుగాలుల నేపథ్యంలో మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లొద్దని సూచించింది.

Also Read: ఏప్రిల్‌లో ఫోన్ల జాతర.. బ్రాండెడ్ మోడల్స్ వచ్చేస్తున్నాయ్-ఫుల్ డీటెయిల్స్ ఇవే!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు