/rtv/media/media_files/2025/09/12/congress-2025-09-12-14-36-53.jpg)
కాంగ్రెస్ కార్యకర్తలకు బిగ్ అలెర్ట్.. ఈ నెల 15వ తేదీన కామారెడ్డిలో నిర్వహించాలని అనుకున్న బీసీ మహా గర్జన పేరిట బహిరంగ సభను కాంగ్రెస్ వాయిదా వేసింది. భారీ వర్ష సూచన కారణంగా ఈ సభను వాయిదా వేసినట్లుదా పీసీసీ వెల్లడించింది. తిరిగి ఎప్పుడు నిర్వహించాలనేది త్వరలోనే వెల్లడిస్తామంది. కాగా రేపు, ఎల్లుండి ఉమ్మడి నిజామాబాద్ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించిన నేపథ్యంలో పీసీసీ ఈ నిర్ణయం తీసుకుంది.
కాంగ్రెస్ కామారెడ్డి సభ వాయిదా
— Telugu Stride (@TeluguStride) September 12, 2025
ఈ నెల 15న కామారెడ్డిలో నిర్వహించ తలపెట్టిన బహిరంగ సభ వాయిదా
భారీ వర్ష సూచన కారణంగా వాయిదా వేశామని, తిరిగి ఎప్పుడు నిర్వహిస్తామనే విషయాన్ని త్వరలోనే తెలియజేస్తామని పీసీసీ వెల్లడి..#Telanganapic.twitter.com/imrt5vJ2WC
అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్లకు సంబంధించి 42% కోటాను అమలు చేయడానికి బిల్లులు ఆమోదించిన నేపథ్యంలో ఈ సభను ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ భావించింది. ఈ సభకు కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య తదితరులను కూడా ఆహ్వానించింది. పీసీసీ చీఫ్‌గా ఏడాది పదవీ కాలం పూర్తి చేసుకున్న మహేశ్ కుమార్ గౌడ్‌కు అభినందన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు. తాజాగా ఈ సభను వాయిదా వేసింది.