Telangana : తెలంగాణలో రేపటి నుంచి కాలేజీలు బంద్

తెలంగాణ రాష్ట్రంలో రేపటి నుంచి ఉన్నత విద్యాసంస్థలు బంద్ కానున్నాయి. ఫీజు రీయింబర్స్ మెంట్, స్కాలర్ షిప్ బకాయిలు ప్రభుత్వం విడుదల చేయకపోవడంపై నిరసనగా ప్రైవేట్, వృత్తి విద్యా కళాశాలల యాజమాన్యాలు ఈ నిర్ణయం తీసుకున్నాయి.

New Update
colleges band

తెలంగాణ రాష్ట్రంలో రేపటి నుంచి ఉన్నత విద్యాసంస్థలు బంద్ కానున్నాయి. ఫీజు రీయింబర్స్ మెంట్, స్కాలర్ షిప్ బకాయిలు ప్రభుత్వం విడుదల చేయకపోవడంపై నిరసనగా ప్రైవేట్, వృత్తి విద్యా కళాశాలల యాజమాన్యాలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. డిగ్రీ, ఇంజినీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ, బీఈడీ, నర్సింగ్ సహా అన్ని కాలేజీలు బంద్ లో పాల్గొననున్నాయి. సెప్టెంబర్ 15వ తేదీ నుంచి నిరవధికంగా ఈ బంద్ కొనసాగుతుందని కాలేజీల ఫెడరేషన్ ప్రకటించింది.

సెప్టెంబర్ 21లోగా రూ.1200 కోట్ల బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ కారణంగా తమ కాలేజీల్లో పనిచేసే సిబ్బందికి జీతాలు చెల్లించలేకపోతున్నామని యాజమాన్యాలు వాపోతున్నాయి. ఇప్పటికే ఈ అంశంపై ప్రభుత్వంతో చర్చలు జరిపినా ఫలితం లేకపోవడంతో బంద్ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాయి. దీనివల్ల దాదాపు 12 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. రేపటి నుంచి జరగాల్సిన పరీక్షలు కూడా వాయిదా వేయాలని వర్సిటీలను కోరినట్లు వెల్లడించారు. ఈ సమస్య పరిష్కారం కోసం ఈ నెల 23, 24 తేదీల్లో విద్యార్థులతో పెద్ద ఎత్తున సమావేశం నిర్వహించనున్నట్లు కూడా ప్రకటించారు. ఈ విషయంపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.

రేపటి నుంచి జరగాల్సిన పరీక్షలు కూడా వాయిదా వేశారు. ఇప్పటికే పరీక్షలను వాయిదా వేయాలని వర్సిటీలను కోరారు. విద్యార్థులు కాలేజీలకు రావొద్దని రమేష్ బాబు కోరారు. కాలేజీల బంద్‌పై 20 రోజుల క్రితమే CSకు సమాచారం ఇచ్చాం రమేష్‌ బాబు అన్నారు. 

Advertisment
తాజా కథనాలు