Delhi AI Summit: హైదరాబాద్‌లో AI వార్ రూమ్.. సీఎం రేవంత్‌రెడ్డి కీలక ప్రకటన

ప్రపంచవ్యాప్తంగా ఏఐ రంగంలో జరుగుతున్న మార్పులు గమనించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో 'ఏఐ వార్ రూమ్' ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. హైదరాబాద్ ఈ వార్ రూమ్ ఏర్పాటుకు అత్యంత అనువైన ప్రాంతమని ఆయన పేర్కొన్నారు.

author-image
By K Mohan
New Update
CM revanth reddy

ఢిల్లీ వేదికగా జరుగుతున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సు 2026లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కీలక ప్రసంగం చేశారు. దేశాన్ని ఆర్టిఫీషియల్ రంగంలో అగ్రగామిగా నిలబెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా ఏఐ రంగంలో జరుగుతున్న మార్పులు క్లోజ్‌గా గమనించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో 'ఏఐ వార్ రూమ్' ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు. లెటెస్ట్ టెక్నాలజీ అందుబాటులో ఉన్న హైదరాబాద్ ఈ వార్ రూమ్ ఏర్పాటుకు అత్యంత అనువైన ప్రాంతమని ఆయన పేర్కొన్నారు.

GST కౌన్సిల్ తరహాలోనే, ఏఐ నియంత్రణ, డెవలప్‌మెంట్‌ కోసం ఒక నేషనల్ ఏఐ కౌన్సిల్‌ను ఏర్పాటు చేయాలని ప్రధాని నరేంద్ర మోదీని కోరారు. గతంలో వచ్చిన పారిశ్రామిక విప్లవాల సమయంలో భారత్ కొన్ని అవకాశాలను కోల్పోయిందని, కానీ ప్రస్తుత ఏఐ శకంలో ఆ తప్పు జరగకూడదని రేవంత్‌రెడ్డి హెచ్చరించారు. భారత్ ఇప్పటివరకు సాఫ్ట్‌వేర్ సేవలకే పరిమితమైందని, ఇకపై ఏఐ చిప్స్ (GPU), డేటా స్టోరేజ్ ప్లాట్‌ఫామ్స్ వంటి కోర్ టెక్నాలజీ ఉత్పత్తుల్లో గ్లోబల్ లీడర్‌గా ఎదగాలని పిలుపునిచ్చారు.

హైదరాబాద్‌లో ఇప్పటికే అంతర్జాతీయ ప్రమాణాలతో ఏఐ స్కిల్డ్ యూనివర్సిటీని ఏర్పాటు చేశామని, ఇది రిసెర్చ్, స్కిల్స్ కలిగిన మానవ వనరుల తయారీకి కేంద్రంగా మారుతుందని చెప్పారు. యువతను ఏఐ రంగంలో పారిశ్రామికవేత్తలుగా మార్చేందుకు ప్రత్యేకంగా 'ఏఐ స్టార్టప్ ఫండ్' ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు.

ప్రతి ఆరు నెలలకోసారి సదస్సులు
టెక్నాలజీలో వస్తున్న వేగవంతమైన మార్పులను అందిపుచ్చుకోవాలంటే ఏటా కాకుండా, ప్రతి ఆరు నెలలకోసారి ఏఐ సదస్సులు నిర్వహించాలని సీఎం ప్రతిపాదించారు. హైదరాబాద్ వంటి నగరాలు ఇలాంటి అంతర్జాతీయ స్థాయి సదస్సులకు ఆతిథ్యం ఇచ్చేందుకు పూర్తి సిద్ధంగా ఉన్నాయని భరోసా ఇచ్చారు.

Advertisment
తాజా కథనాలు