CM Revanth Reddy : కేంద్రం మెడలు వంచుతాం.. బీసీ రిజర్వేషన్లు సాధిస్తాం : సీఎం రేవంత్ రెడ్డి

కులగణన సర్వే ఆధారంగానే బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ బిల్లు రూపొందించామన్నారు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి.  కులగణన దేశానికే రోల్ మోడల్ అని చెప్పారు.  కేంద్రం త్వరగా రిజర్వేషన్ల బిల్లును ఆమోదిస్తే.. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామన్నారు.

New Update
cm-revanth-reddy

కులగణన సర్వే ఆధారంగానే బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ బిల్లు రూపొందించామన్నారు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి.  కులగణన దేశానికే రోల్ మోడల్ అని చెప్పారు.  కేంద్రం త్వరగా రిజర్వేషన్ల బిల్లును ఆమోదిస్తే  స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన రేవంత్..  అసెంబ్లీ ఆమోదించిన బిల్లును రాష్ట్రపతి ఆమోదం కోసం పంపించినట్లుగా వెల్లడించారు.  వందేళ్లుగా వాయిదా పడిన కులగణనను నెల రోజుల్లోనే పూర్తి చేశామన్న సీఎం..  స్థానిక సంస్థల్లో రాజకీయ రిజర్వేషన్ల కోసం తీర్మానాల చేసే కేంద్రానికి పంపినా జాప్యం జరుగుతుందని, బిల్లు ఆమోదం కోసం కేంద్రంలోని విపక్ష కూటమి నేతలను కూడా కలిసి మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నిస్తున్నామని వివరించారు.  

బీజేపీ వితాడవాదం చేస్తుంది

బీసీ రిజర్వేషన్ల బిల్లుపై బీజేపీ వితాడవాదం చేస్తుందన్నారు సీఎం రేవంత్.  అసెంబ్లీలో బిల్లుకు బీజేపీ మద్దతు తెలిపిందని, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు మాత్రం విడ్డూరంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.  ముస్లిం రిజర్వేషన్లు తొలిగించాలని కుట్రచేస్తున్నారని సీఎం ఆరోపించారు. తాము రాజ్యాంగానికి లోబడే రిజర్వేషన్లు  పెంచాలని అనుకుంటున్నామని తెలిపారు.  రేపు రాహుల్ గాంధీ, ఖర్గేలను కలిసి కులగణన, బీసీ రిజర్వేషన్లపై చర్చిస్తామన్నారు.  కేంద్రం మెడలు వచ్చి బీసీ రిజర్వేషన్లు సాధిస్తామని తెలిపారు.  

Advertisment
తాజా కథనాలు