గుడ్ న్యూస్ చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి

TG: సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. 30రోజుల్లో రాష్ట్రంలో ఫ్యామిలీ డిజిటల్‌ హెల్త్‌ కార్డుల ప్రక్రియ ప్రారంభించనున్నట్లు తెలిపారు. ప్రజలకు నాణ్యమైన విద్య, వైద్యం అందించడం తమ ప్రభుత్వ ప్రాధాన్యతలని తెలిపారు.

CM REVANTH
New Update

CM Revanth Reddy: తెలంగాణ రాష్ట్ర ప్రజానీకానికి సీఎం రేవంత్ రెడ్డి తీపి కబురు అందించారు. నెల రోజుల్లో రాష్ట్రంలో ఫ్యామిలీ డిజిటల్‌ హెల్త్‌ కార్డుల ప్రక్రియ ప్రారంభిస్తున్నట్లు ప్రకటన చేశారు. తెలంగాణలోని అన్ని గ్రామాల్లో ప్రతి ఇంటికి వెళ్లి వారి  వ్యక్తిగత ఆరోగ్య ప్రొఫైల్‌ రూపొందిస్తామని అన్నారు.

రాష్ట్రంలో ఇప్పుడున్నది సంక్షేమాభివృద్ధిని అమలు చేసే ప్రజా ప్రభుత్వమని, ప్రాఫిట్ మేకింగ్ బిజినెస్ ఓరియెంటెడ్ ప్రభుత్వం కానేకాదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ప్రజలకు నాణ్యమైన విద్య, వైద్యం అందించడం తమ ప్రభుత్వ ప్రాధాన్యతలని తెలిపారు. 

పేదలకు భారమవుతోంది...

హెల్త్ ప్రొఫైల్ కార్డుల ప్రక్రియలో సహకారానికి సంబంధించి సామాజిక బాధ్యత కలిగిన దుర్గాబాయి  దేశ్‌ముఖ్ మహిళా సభ లాంటి సంస్థలతో త్వరలోనే ఒక సమావేశం ఏర్పాటు చేయాలని సీఎం వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్‌ రాజనర్సింహకు సూచించారు. క్యాన్సర్ మహమ్మారితో చాలా మంది అనేక ఇబ్బందులు పడుతున్నారని, క్యాన్సర్ చికిత్స పేదలకు భారమవుతోందని, రాష్ట్రంలో క్యాన్సర్ వైద్య సేవలు అందరికీ అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని సీఎం అభిప్రాయపడ్డారు. దుర్గాబాయి దేశ్‌ముఖ్ మహిళా సభ, హాస్పిటల్ సేవల విస్తరణపై యాజమాన్యం తీసుకొచ్చిన ప్రతిపాదనలను పరిశీలించి, అమలుకు ప్రయత్నిస్తానని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చెప్పారు.

#telangana-news #cm-revanth-reddy
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe