విద్యా, వైద్యంపై స్పెషల్ ఫోకస్.. దేశ చరిత్రలోనే తెలంగాణ రికార్డ్

ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా ఆరోగ్యశ్రీ ఉత్సవాలను సీఎం రేవంత్ ప్రారంభించారు. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ మార్గ్‌లో హెచ్ఎండీఏ గ్రౌండ్స్‌లో అంబులెన్స్ లకు పచ్చజెండా ఊపి ప్రారంభించారు. అధికారంలోకి వచ్చాక విద్యా, వైద్యంపైనే ప్రత్యేక దృష్టి పెట్టాం అని అన్నారు.

author-image
By Seetha Ram
CM Revanth Reddy
New Update

Hyderabad: సీఎం రేవంత్ రెడ్డి మరో శ్రీకారానికి పచ్చజెండా ఊపారు. ప్రజా పాలన విజయోత్సవాల్లో భాగంగా ఆరోగ్యశ్రీ ఉత్సవాలను సీఎం రేవంత్ ప్రారంభించారు. ఇవాళ (సోమవారం) హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ మార్గ్‌లో హెచ్ఎండీఏ గ్రౌండ్స్‌లో అంబులెన్స్ లకు పచ్చజెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. 

Also Read: 17 ఏళ్లలో ఐదింటి కథ ముగిసింది..విమానయాన రంగం కుదేలు!

దేశ చరిత్రలో తెలంగాణ రికార్డు..  

అధికారంలోకి వచ్చాక విద్యా, వైద్యంపైనే ప్రత్యేక దృష్టి పెట్టాం అని అన్నారు. ఇప్పటికి 7 వేల 750 మంది నర్సులకు నియామక పత్రాలు అందజేశాం అని పేర్కొన్నారు. ఏడాది లోనే వైద్యశాఖలో 14వేల ఉద్యోగాల భర్తీ చేశాం అని తెలిపారు. దేశ చరిత్రలో ఇంతపెద్ద ఎత్తున వైద్యశాఖలో ఉద్యోగాల భర్తీ చేయలేదన్నారు. వైద్యశాఖ బలోపేతం అయితేనే తెలంగాణ సమాజం ఆరోగ్యవంతంగా ఉంటుందని పేర్కొన్నారు. మా ప్రభుత్వ తొలి ప్రాధాన్యత విద్యా, వైద్యానికి ఇస్తుందని తెలిపారు. గతంలో ప్రశ్నాత్రాలు జీరాక్స్ సెంటర్లలో అమ్ముకునే పరిస్థితి ఏర్పడిందన్నారు. ఏ రోజు గత ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉద్యోగాల భర్తీ చేపట్టలేదన్నారు.  

ఏడాదిలోనే 50 వేలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేశామన్నారు.స్వతంత్ర భారతదేశంలో ఏడాదిలోనే 50వేల ఉద్యోగాల భర్తీ చేసిన చరిత్ర ఏ రాష్ట్రానికి లేదని అన్నారు. డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తే రాజకీయ ప్రేరేపిత ఆందోళనలు చేయించారని తెలిపారు. పరీక్షలు వాయిదా వేయాలంటూ కృత్రిమ ఉద్యమం చేయించారన్నారు. తెలంగాణ వచ్చాక ఒక్కసారి కూడా గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించలేదన్నారు. పదేళ్లుగా పరీక్షలు వాయిదా వేసుకుంటూ వచ్చారన్నారు. ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణం అందించామని పేర్కొన్నారు. 

Also Read: మా జోలికొస్తే తాటతీస్తాం.. కేసీఆర్ ను అంత మాట అంటావా! కవిత ఫైర్

అధికారంలోకి వచ్చిన వెంటనే గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించాం అన్నారు. రూ.830 కోట్లు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా పేదలకు వైద్యం అందించామన్నారు. పేదల గృహాలకు రూ.200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నామన్నారు. అలాగే రూ.500లకే సిలిండర్ అందిస్తున్నామన్నారు. సంక్రాంతి తరువాత రైతు భరోసా ఖాతాల్లో వేస్తామన్నారు. ఈ ప్రభుత్వం పదేళ్లు ఉంటుందని అన్నారు.  

#cm-revanth-reddy
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe