CM Revanth Reddy : జీతాలు కట్‌ చేస్తాం.. సీఎం రేవంత్‌రెడ్డి సంచలన ప్రకటన

తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి కీలక ప్రకటన చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే ఉద్యోగుల జీతంలో కోత విధిస్తామని అన్నారు. శిల్పకళావేదికలో గ్రూప్-2 ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేశారు.

New Update
cm revanth (1)

తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి కీలక ప్రకటన చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే ఉద్యోగుల జీతంలో కోత విధిస్తామని అన్నారు. శిల్పకళావేదికలో గ్రూప్-2 ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేసిన కార్యక్రమంలో సీఎం రేవంత్ ఈ ప్రకటన చేశారు. తల్లిదండ్రుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లుగా తన దృష్టికి వస్తే, సంబంధిత ఉద్యోగి జీతం నుంచి 10 నుంచి 15 శాతం వరకు కోత విధిస్తామ్నారు. 

ఉద్యోగులకు ఒకటో తేదీన జీతం ఎలాగైతే అందుతుందో అలాగే కోత  విధించిన డబ్బును వారి  తల్లిదండ్రులకు కూడా అదే రోజున అందేలాగా చేస్తామన్నారు. దీని కోసం త్వరలోనే ఒక ప్రత్యేక చట్టాన్ని తీసుకొస్తామని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పుకొచ్చారు. రక్తం చెమటగా మార్చి మిమ్మల్ని ఇంతవాళ్లను చేసిన తల్లిదండ్రులను మరిచిపోవద్దన్నారు సీఎం రేవంత్ . నిస్సహాయులకు సహాయం చేయడం మన బాధ్యత అని తెలిపారు. గ్రూప్‌-2 ఉద్యోగాలకు ఎంపికైన 783 మంది అభ్యర్థులకు సీఎం, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సీఎస్‌ రామకృష్ణారావు, మంత్రి పొన్నం ప్రభాకర్‌.. చేతుల మీదుగా నియామక పత్రాలు అందజేశారు.  

ఆత్మబలిదానాలతో తెలంగాణ రాష్ట్రం

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ..  విద్యార్థి, నిరుద్యోగ యువత ఆత్మబలిదానాలతో తెలంగాణ రాష్ట్రం సాకారమైందన్నారు. శ్రీకాంతాచారి, వేణుగోపాల్‌రెడ్డి, ఈషాన్‌రెడ్డి, యాదయ్య లాంటి యువ విద్యార్థులు తమ జీవితాలను ధారపోసి.. ఆత్మబలిదానాలతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారని చెప్పారు. అమరుల త్యాగాల పునాదులపై ఏర్పడిన తెలంగాణలో పదేళ్లు అధికారం చెలాయించిన వాళ్లు ఒక్కక్షణం కూడా నిరుద్యోగుల గురించి ఆలోచన చేయలేదని విమర్శించారు. అమరుల ఆశయ సాధనపై వాళ్లు ఆలోచన చేసి ఉంటే మీకు ఎనిమిదేళ్ల క్రితమే ఉద్యోగాలు వచ్చేవన్నారు సీఎం రేవంత్. వాళ్ల కుటుంబంలో పదవులు భర్తీ చేసుకున్నారు తప్ప గ్రూప్ 2 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వలేదన్నారు. 

పదిహేనేళ్లుగా గ్రూప్ 1 ఉద్యోగాల భర్తీ జరగలేదు అంటే… ఇంతకంటే దౌర్భాగ్యం మరొకటి ఉంటుందా అని సీఎం ప్రశ్నించారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మేం గ్రూప్ 1 ఉద్యోగాల భర్తీ ప్రక్రియ పూర్తి చేశామని చెప్పుకొచ్చారు. గ్రూప్ 2 పరీక్షలు నిర్వహించి ఇవాళ నియామక పత్రాలను అందిస్తున్నామని తెలిపారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన మొదటి ఏడాదిలోనే 60 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని సీఎం చెప్పుకొచ్చారు. గత పాలకులు ఉద్యోగాల భర్తీని అడ్డుకునేందుకు కేసులు వేసి అక్రమ సంపాదనతో ఏర్పాటు చేసుకున్న సోషల్ మీడియా వ్యవస్థతో మాపై బురద జల్లే ప్రయత్నం చేశారని సీఎం రేవంత్ మండిపడ్డారు. 

Advertisment
తాజా కథనాలు